మాట నిల‌బెట్టుకున్న రౌడీ హీరో!

రౌడీ హీరో ఏది చేసిన వార్తే అయిపోతోంది. టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మంచి గుర్తింపునే సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ దాన్ని పెంచుకునే అవ‌కాశం ఏది చిక్కినా దాన్ని ఎంచ‌క్కా వాడేసుకుంటున్నాడు. తాజాగా స్టైలిష్‌స్టార్ బ‌న్నీకి గిఫ్ట్ ఇచ్చి మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచాడు. త‌నకున్న‌ క్రేజ్‌ని రౌడీ బ్రాండ్‌గా మార్చుకుని క్లాత్ బ్రాండింగ్ రంగంలొకి ఎంటై ఇప్ప‌టికే యూత్‌ని పిచ్చెక్కిస్తున్న విజ‌య్ దేవ‌రకొండ అల్లు అర్జున్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

ఓ మాట‌ల సంద‌ర్భంలో బ‌న్నీకి మాటిచ్చిన విజ‌య్‌ దేవ‌ర‌కొండ తాజాగా ఆ మాట‌ని నిల‌బెట్టుకున్నాడు. త‌న రౌడీ బ్రాండ్‌తో స్వ‌యంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ని బ‌న్నీకి పంపించాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బ‌న్నీ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. `బ‌న్నీ అన్నా అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి గుడ్ ల‌క్‌. ఇచ్చిన మాట ప్ర‌కారం స్వ‌యంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ని పంపిస్తున్నాను` అని కాస్ట్యూమ్స్‌తో పాటు పంపిన కార్డ్‌పై విజ‌య్ వెల్ల‌డించారు. దీనిక బ‌దులుగా విజ‌య్‌కి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్ప‌డం ఇద్ద‌రి మ‌ధ్య వున్న అనుబంధాన్ని తెలియ‌జేస్తోంది.