బోయపాటి శ్రీను.. ఇండస్ట్రీ అంతా ఓ పక్కకు వెళుతుంటే రొడ్కొట్టుడు మాస్ మసాలా హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకి 11 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఇక నుంచి ఈయనని సీతయ్య అని పిలవాలేమో?. చేతిలో హిట్టు లేకపోయినా తాను చెప్పింది ఎవ్వరైనా వినాల్సిందే.. చివరికి బాలయ్యతో సహా అంటూ సీతయ్యలా బిహేవ్ చేస్తున్నాడట.
బోయపాటి శ్రీను – బాలకృష్ణ కలిసి ముచ్చటగా మూడవసారి కలిసి ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందు బాలయ్య పెట్టిన ఆంక్ష బడ్జెట్. 70 కోట్లంటే కష్టం తగ్గించు అన్నాడట. బోయపాటి వింటేనా 70 పెట్టాల్సిందే అనడం..బాలయ్య మరో మాట మాట్లడకపోవడం జరిగిపోయాయి. ఇది చూసిన టీమ్ ఇదేమి చిత్రం..బాలయ్య చెబితే బోయపాటి వినాలి. కానీ ఇప్పుడేంటి అంతా రివర్స్‌లో జరుగుతోందని ముక్కున వేలేసుకుంటున్నారట. ఇక బాలయ్య వ్యక్తిగత సిబ్బందిది చెప్పాలంటే అరణ్యరోదనే.
ఈ సినిమాకు బాలయ్య విగ్గుతో పాటు కాస్ట్యూమ్స్, మేకప్ వర్క్ చూసుకునే వ్యక్తిగత సిబ్బందిని కూడా బోయపాటి పక్కన పెట్టాడట. ఎవరు ఎన్ని చెప్పినా తనకు మేకప్ చేసేవారిని, కాస్ట్యూమర్‌ని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చడానికి ఇష్టపడని బాలయ్య వారిని బోయపాటి పక్కన పెట్టినా నోరు మెదపలేదంటే బోయపాటి ఈ సినిమాకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీపడటం లేదని అర్థమవుతోంది. ఫ్లాప్ మహత్యం అంటే ఇదే మరి.