బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనున్న ఏజెంట్ సాయి

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటూ సందడి చేసిన తెలుగు అబ్బాయి నవీన్ పోలిశెట్టి. సినిమాకు మునుపే యూట్యూబర్ గా ప్రేక్షకులకు సుపరిచితుడే. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా హిట్ తరువాత అతనికి బాగానే అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అందులోను ముఖ్యంగా అతను హిందీ సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేయనున్నాడు.

హిందీలో సుశాంత్ సింగ్ రాజపుట్ తో పాటు మరో హీరోగా హిందీలో అతను చేసిన సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్. ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుంది. అతని తదుపరి తెలుగు చిత్రం విశేషాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.