బాలయ్య 106 వ చిత్రం బోయపాటితోనే

బాలయ్య ప్రస్తుతం తన 105 వ చిత్రం కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆయన తదుపరి చిత్రం ఎవరు చేస్తున్నారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో తన 106 వ చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీనుతోనే ఖరారు అయింది.

అసలు చెప్పాలంటే ఆయన ఎన్ఠీఆర్ బయోపిక్ చేసిన వెంటనే బోయపాటి తో సినిమా ఉండాల్సింది. కానీ బోయపాటికి వెంటనే ‘వినయ విధేయ రామా’ తో ప్లాప్ రావడం, బాలయ్యకు చెప్పిన కథ నచ్చకపోవడంతో బోయపాటి తో సినిమా వద్దనుకున్నారు. కానీ బోయపాటి స్క్రిప్ట్ కు తగ్గ మార్పులు చేసాక అది నచ్చి తన తదుపరి చిత్రం బోయపాటి తోనేనని ఖరారు చేశారు బాలయ్య.

ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది. వీరి కలయికలో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు చాలా పెద్ద విజయం సాధించడంతో ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు మరి కొద్ది రోజుల్లో తెలియనున్నాయి.