బాలకృష్ణ సినిమా టైటిల్తో మళ్ళీ హీరోగా అల్లరి నరేష్

అల్లరి నరేష్ పని అయిపోయిందనుకున్నారు అంతా. కానీ మహర్షి సినిమా విజయం ఆయనకు మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని కొత్త అవకాశాలని ఇచ్చింది. ఆయనకు పెద్ద హీరోల సినిమాల్లో మంచి పాత్రలే కాకుండా మళ్ళీ హీరో పాత్రలు కూడా వచ్చి పడుతున్నాయి.
పీవీ గిరి దర్శకత్వంలో ఒక హాస్య ప్రధాన సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఒకప్పటి బాలకృష్ణ సినిమా ‘బంగారు బుల్లోడు’ అని ఖరారు చేశారు. అయితే ఈ టైటిల్ ముందుగా గోపీచంద్ సినిమాకి అనుకున్నారు కానీ ఆ టైటిల్ చివరికి అల్లరి నరేష్ కి దక్కింది. ఈ సినిమాలో నరేష్ కి జోడీగా పూజా ఝవేరి నటిస్తోంది.