ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది. కెరీర్‌లో బంప‌ర్ హిట్ ల‌భించ‌డంతో అమితానందంలో వున్న బ‌న్నీ, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో పాటు చిత్ర బృందం సోమ‌వారం మీడియాని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మాట‌ల మాంత్రికుడు ప‌వ‌న్ గురించి మాట్లాడి మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ఈ చిత్రాన్ని చూశారా అన్న ప్ర‌శ్న‌కు త్రివిక్ర‌మ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌స్తుతం ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా వున్నార‌ని, ఈ టైమ్‌లో సినిమాలు ఎలా చూస్తార‌ని, మ‌రో విష‌యం ఏంటంటే ఆయ‌న సినిమాల‌నే ఆయ‌న చూసుకోరు. మూడు నెల‌ల త‌రువాత చూడాల‌నిపిస్తే చూస్తారు. తాను బ్ర‌తిమాలితేనే 120 రోజుల త‌రువాత `అత్తారింటికి దారేది` చూశార‌ట ప‌వ‌న్‌. ఇదే త‌ర‌హాలో `అల వైకుంఠ‌పుములో`ను చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలి` అని చ‌మ‌త్క‌రించారు త్రివిక్ర‌మ్‌.