ప్లాఫ్ లో ఉన్నా బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే..

బాలయ్య రెమ్యునేషన్ దెబ్బకు మిగతావాళ్లకు అన్ని కట్

నందమూరి బాలకృష్ణ – కె.ఎస్‌.రవికుమార్‌ కలయికలో వచ్చిన చిత్రం ‘జై సింహా’. సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం 2018 సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ కలయికలో మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది. బాలయ్య – కె.ఎస్‌ రవికుమార్‌ మరోసారి కలసి పనిచేస్తున్నారు. సి.కల్యాణ్‌ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని రీసెంట్ గా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఈ చిత్రానికి ఎంత రెమ్యునేషన్ బాలయ్య తీసుకుంటున్నాడనే విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం బాలయ్య పది కోట్లు తీసుకుంటున్నారట. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య మార్కెట్ పరిస్దితి బాగోలేదు. దాంతో తగ్గిస్తాడేమో అనుకున్నారు. కానీ బాలయ్య మాత్రం వెనకడుగు వేసేదేలేదని సి కళ్యాణ్ దగ్గర ముక్కుపిండి మరీ వసూలు చేసాడట. దాంతో నిర్మాత కళ్యాణ్ …ఆ ఎమౌంట్ ఎడ్జెస్ట్ చేయటం కోసం మిగతా డిపార్టమెంట్ లో కోతలు పెడుతున్నారట.

నిజానికి ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ తరవాత బోయపాటి శ్రీనుతో బాలయ్య ఓ సినిమా చేయాలి. అది కాస్త ఆలస్యం అవుతుండడంతో.. ఈలోగా కె.ఎస్‌.రవికుమార్‌ సినిమాని పట్టాలెక్కించారు బాలయ్య. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ ఏంటో రివీల్ చేయలేదు. ‘రూలర్‌’ అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు ‘జడ్జిమెంట్‌’, ‘డిపార్ట్‌మెంట్‌’ లాంటి టైటిల్స్ కూడా బయటకు వచ్చాయి. వీటిలో ఒకదాన్ని త్వరలోనే ఖరారు చేసే అవకాశాలున్నాయి. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈనెల 18 నుంచి రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్‌ మొదలుకానుంది. సంగీతం: చిరంతన్‌ భట్‌.