ప్రభాస్ అన్నారు చివరకు ఫేక్ అని తేల్చారు

ప్రభాస్ కు కలిసొచ్చిందా?

గత కొద్ది రోజులుగా ఓ వార్త మీడియాలో నానింది. అయితే అది చివరకు ఫేక్ అని తేలిపోయింది. అదేమిటంటే…రేపు రిలీజ్ కాబోతున్న సైరా సినిమా ప్రమోషన్ కోసం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగబోతున్నాడని . మెగా ఫ్యామిలీకి ప్రభాస్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. సాహో ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్‌లను కలిసిన సంగతి తెలిసిందే. సైరా ట్రైలర్ చూసి చిరంజీవి తనకు ఫోన్ చేసిన అభినందించారని ప్రభాస్ స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. వీటిన్నటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ ఈ సినిమాని ప్రమోట్ చేయబోతున్నారని వార్త పుట్టించి వదిలేసారు.

అయితే ప్రభాస్ ప్రస్తుతం ప్యారిస్ లో ఉన్నారు. ఆయనకు ప్రస్తుతం అసలు సినిమాలు గురించి మాట్లాడే మూడ్ లేదని తేలిపోయింది. ఎందుకంటే తన సొంత సినిమా జాను ని సైతం ప్రక్కన పెట్టేసారు. ఈ విషయం అర్దం చేసుకోకుండా మీడియా ఈ విషయం గురించి కోడై కూసింది. అయితే సైరా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగితే… బాలీవుడ్‌లో ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందనేది మాత్రం నిజం. అయితే రామ్ చరణ్ ఈ విషయంలో ప్రభాస్ ని టచ్ చేయలేదని తేలిపోయింది.

ఇక ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందు బయోపిక్ అని చెప్పి ఆ తర్వాత ఈ సినిమా ఎవరి జీవితంపై తెరకెక్కింది కాదని సైరా చిత్ర యూనిట్ ప్రకటించడంతో తమిళనాడుకు చెందిన తెలుగు సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిఈ సినిమా విడుదల చేయోద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై హైకోర్టు స్పందించి సినిమా చూడాలా లేదా అనే విషయం ప్రజలపై ఆధారపడి ఉంది. రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ సినిమాను ఆపలేమని స్పష్టం చేసారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles