ఈ సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నాలుగు చిత్రాల్లో రజనీ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఇక సరిలేరు మాస్ హిట్టైతే, అల క్లాస్ హిట్ గా కొందరు భావిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కనపెడితే… ఆల్రెడీ అల్లుఅర్జున్ నటించిన అలవైకుంపురంలో చిత్రం సంక్రాంతి విన్నర్ అన్న పోస్ట్ రిలీజ్ చేసేసింది. ఇక పేపర్లకు, ఛానళ్ళకు మీడియాకు ఇచ్చే యాడ్లలో కూడా మేమే విన్నర్ అన్నట్లు సంక్రాంతి విన్నర్ అంటూ తమ సినిమా ట్యాగ్‌ను తగింలించేసుకున్నారు ఆ చిత్ర యూనిట్. అయితే సంక్రాంతి మొత్తం నాలుగు సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పటి వరకు మూడు సినిమాలు మాత్రమే విడుదల కాగా.. ఇంకా నాలుగో చిత్రం విడుదల కాకముందే సంక్రాంతి విన్నర్ అని వీళ్ళు పోస్టర్ వేయించేసుకున్నారు.
ఇక మొదటి నుంచి అన్ని విషయాల్లో పోటీ పడుతున్న సరిలేరు చిత్రం మరో ట్యాగ్‌ని విడుదల చేసింది. సినిమా ప్రమోషన్ మొదలైన దగ్గర నుంచి వీరిద్దరు పోటీ పడటం అందరికీ తెలిసిన విషయమే.
మొదటి రోజు తమ సినిమా సూపర్ హిట్ అని ప్రకటించుకున్న ఈ సినిమా రూపకర్తలు ఇప్పుడు తమ సినిమాకు ట్యాగ్ లైన్ మార్చారు. ‘రియల్ సంక్రాంతి విన్నర్’ అట. ఈ సినిమాకు ఇప్పుడు ఈ ట్యాగ్ ను తగిలించారు.
అల్లుఅర్జున్ సినిమా అలవైకుంఠపురంలో చిత్ర యూనిట్ ఏమో తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని ప్రకటించుకుంటే… సరిలేరు యూనిట్ మాత్రం తమ సినిమా రియల్ సంక్రాంతి విన్నర్ అంటున్నారు. ఇలా ఒకరి పై ఒకరు మొదటి నుంచి కౌంటర్లు వేసుకుంటూనే వస్తున్నారు. వాళ్లది ఫేక్ ప్రకటన అని, తమది రియల్ ప్రకటన అన్నట్టుగా వీళ్లు ప్రకటించుకున్నారు. ఇంతకీ ఇన్ని రోజులూ పోటీ అనేది కేవలం సోషల్ మీడియాలో ఏదో ఫ్యాన్స్ మధ్యమాత్రమే జరుగుతుంది అనుకుంటే… ఇప్పుడు ఈ ట్యాగ్‌తో అర్దమయిపోయింది. అది ఫ్యాన్స్ మధ్య కంటే ఈ రెండు చిత్రాల యూనిట్ మధ్య ఎక్కువగా ఉన్నట్లు పలు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.