సాయి పల్లవికి పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు?

కథానాయిక సాయి పల్లవి పెళ్లిపై ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాలేజీ రోజుల్లో లవ్‌ ఫెయిల్యూర్‌ కారణంగా జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించు కుందని  ఓ వార్త అప్పట్లో వచ్చింది. తాజాగా సాయి పల్లవి సినిమాలకు దూరం కానుందనే కథనాలు ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఫిదా బ్యూటీ ఫైనల్ గా తనకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి.

తన పెళ్లిపై వస్తున్న వార్తలపై సాయిపల్లవి ఓ సందర్భంలో స్పందించింది. “త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్‌ పైనే వుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు” అని సాయిపల్లవి తేల్చి చెప్పింది . సాయి పల్లవి ‘విరాట పర్వం’లో నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సాయి పల్లవి లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో సాయి పల్లవి ఎరుపు రంగు డ్రెస్‌లో అమరవీరుల స్థూపం దగ్గర ఓ సాధారణ అమ్మాయిలా కూర్చోని ఉంది.

రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. రానా పోలీస్ ఆఫీసర్‌గాను, సాయిపల్లవి నక్సలైట్‌గా కనిపించనున్నది అనేది సమాచారం. సాయిపల్లవి ఎందుకు నక్సలైట్ గా మారవలసి వచ్చింది? నక్సలైట్ గా మారిన ఆమె చివరికి సాధించినది ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. అయితే అనుకున్నది సాధించే క్రమంలో ఆమె తన ప్రాణాలను కూడా కోల్పోతుందట. ఆ సన్నివేశంలో సాయి పల్లవి నటనతోకన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు.