పూజ మరోసారి పారితోషకం పెంచేసిందా?

Pooja Hegde

పూజా హెగ్డే ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకున్నా బ్రేక్ రావడానికి కొంత సమయం పట్టింది, దాంతో ఇప్పుడు ఈమె జోరుకు అడ్డు లేకుండా పోయింది. ఇప్పుడు ఏ స్టార్ హీరో పక్కన చూసినా తానే హీరోయిన్. దాంతో ఆమె పెట్టె షరతులకు కూడా దర్శకనిర్మాతలు తల ఒగ్గారు.

ఇప్పటికే సినిమాకి 1 .5 కోట్లు తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ‘గద్దలకొండ గణేష్’ విజయవంతం కావడంతో ఆమె మరోసారి తన పారితోషకాన్ని 2 కోట్లకు పెంచేసిందట. అయినా సరే, కిమ్మనకుండా దర్శకనిర్మాతలు ఆమె వెంట పడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్, అఖిల్ వంటి హీరోలకు ఆమె హీరోయిన్. ఇంత క్రేజ్ వచ్చినప్పుడు ఎవరైనా ఎందుకు తగ్గుతారు అనుకుంటున్నారట పరిశ్రమ వర్గాలు.