యువహీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే కలిసి జంటగా నటించిన చిత్రం ‘ఇద్దరిలోకం ఒకటే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాతగా రూపొందిన చిత్రమిది. జిఆర్ కృష్ణ దర్శకుడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పర్వాలేదనిపించుకుంది కానీ ఆశించినంతగా అయితే రాలేదు. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రాజ్‌తరుణ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
నాలుగైదు జోనర్స్ కలిపి చేసిన సినిమా కాదు. సినిమా అంతా ప్రేమే ఉంటుంది. టర్కీష్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈసినిమా చేశాం. అందులో ఎమోషన్స్‌ను మనకు తగ్గట్టు మార్చి ఈసినిమా చేశాం.. ముందు స్క్రిప్టును రెడీ చేసుకున్న తర్వాత బెక్కం వేణుగోపాల్‌గారు, మా డైరెక్టర్ కృష్ణ తనను లవ్ లైక్స్ కో ఇన్సిడెంట్‌తో చూడమన్నారు.. సరేనని చూశా.. నాకు బాగా నచ్చింది..
గత కొంతకాలంగా హిట్ అనేదిలేని రాజ్ తరుణ్.. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా (డిసెంబర్ 25న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నప్పటికీ రాజ్ కు నిరాశే మిగిలింది. ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని..రాజ్ ఖాతాలో మరో ప్లాప్ గా చేరింది.
కాగా ఈ సినిమాకుగాను రాజ్ తరుణ్ కు దిల్ రాజ్ అతి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హీరోగా సక్సెస్ అయ్యాక 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడు రాజ్ తరుణ్. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న రాజ్ తరుణ్‌కు కేవలం 10 లక్షల పారితోషికం మాత్రమే ఇచ్చాడట నిర్మాత దిల్ రాజు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను రాజ్ తరుణ్‌తో తీయాలనుకోలేదు. ఈ సినిమాను మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తొలి చిత్రంగా తెరకెక్కించాలని భావించాడు దిల్ రాజు. సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు కూడా. అయితే అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో అశోక్ స్థానంలో రాజ్ తరుణ్‌ను తీసుకొని సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ఇప్పుడుకాదు సంవ్సరం క్రితమే మొదలైంది. కానీ హీరో మారాడు. దర్శకుడుకి రెండో చిత్రమిది గతంలో ఆడుమగాడ్రా బుజ్జి చిత్రం కూడా ఫ్లాప్ టాక్‌నే తెచ్చుకోగా ఇప్పుడు ఈ చిత్రం కూడా అదే టాక్ తెచ్చుకుంది.