టీజర్ టాక్ : మాస్ ఫీస్ట్ తో నాగ్ “నా సామిరంగ” బొమ్మ.. 

టాలీవుడ్ కింగ్ ఆల్ టైం మన్మధుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ షోలో హోస్ట్ గా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇపుడు నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రమే “నా సామిరంగ”. కాగా ఈ చిత్రాన్ని విజయ్ బిన్నీ తెరకెక్కించగా ఈ సినిమా జెట్ స్పీడ్ లో కంప్లీట్ అయిపోతూ వచ్చింది.

మరి ఈ సినిమాలో యంగ్ హీరో రాజ్ తరుణ్ సహా అల్లరి నరేష్ లు కూడా నటించగా ఈరోజు చిత్ర యూనిట్ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. కాగా ఈ టీజర్ మాత్రం అదిరే లెవెల్లో ఉందని చెప్పడంలో డౌట్ లేదు. లాస్ట్ టైం వచ్చిన బంగార్రాజు, సోగ్గాడే చిన్నినాయన చిత్రాల తరహాలోనే ఓ సూపర్ విలేజ్ డ్రామాగా ఇది కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ ఆశికా రంగనాథ్ కానీ తనతో పాటుగా నాగార్జున కెమిస్ట్రీ టీజర్ లో సూపర్బ్ గా ఉన్నాయి.

ఇంకా ఏక్షన్ ఎపిసోడ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీటి అన్నిటితో ఓ పండుగలాంటి కంప్లీట్ ప్యాక్ లా ఈ సినిమా ఉంది. దీనితో ఈ టీజర్ మాత్రం అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి. అలాగే ఈ టీజర్ లో ఎం ఎం కీరవాణి మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తానికి అయితే ఈ సంక్రాంతి పండుగకి చిత్ర యూనిట్ గట్టి సరుకునే తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. 
Naa Saami Ranga Teaser | Nagarjuna Akkineni | Ashika Ranganath | Vijay Binni | MM Keeravaani