పవన్ తో పూజాహెగ్డే ఖరారైనట్టే!?

తెలుగులో ‘పింక్’ రీమేక్‌కు పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ‘దిల్’రాజు సీన్‌లోకి దిగడంతో పవన్ కల్యాణ్ రీఎంట్రీ కన్ఫర్మ్ అవ్వడం తెలిసిందే.అయితే, పవన్ చేస్తున్న సినిమాలో ఉమెన్ లీడ్‌రోల్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

‘పింక్’లో కథానాయిక పాత్ర కోసం కైరా అద్వాని పేరు మొదట్లో వినిపించింది. అయితే ఆమె డేట్స్‌తో వస్తోన్న ఇబ్బంది, భారీ పారితోషికం డిమాండ్ నేపథ్యంలో మేకర్లు పునరాలోచనలో పడ్డారు. ఈ పాత్ర కోసం తాజాగా పూజాహెగ్డే పేరు వినిపిస్తోంది. వరుస హిట్లతో మంచి క్రేజ్‌తోవున్న పూజను తీసుకోవడం వల్ల -ప్రాజెక్టుకు ప్లస్ కావొచ్చన్న ఆలోచనలో మేకర్లు ఉన్నట్టు సమాచారం. పూజ ఎంపిక దాదాపు ఖరారైనట్టేనన్న మాట వినిపిస్తోంది.