Home Tollywood పవన్ అప్పుడు చాలా సిగ్గుపడ్డారు: సమంత!

పవన్ అప్పుడు చాలా సిగ్గుపడ్డారు: సమంత!

పవన్ సిగ్గుపడటం గురించి చెప్పిన సమంత

తెరమీద హీరో కావచ్చు కానీ నార్మల్ గా వాళ్లు మనష్యులే .వాళ్లకి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అయితే మనం తెరపైనే వాళ్లను చూస్తాం కాబట్టి..కొన్ని నమ్మకాలను వాళ్ల చుట్టూ ప్రోది చేసుకుంటాం. అయితే ఒక్కసారి వాటిని బ్రేక్ చేసే విషయాలు మనం వింటూంటాం. అలాంటి సీక్రెట్ నే పవన్ కళ్యాణ్ గురించి సమంత రివీల్ చేసింది.

పవన్ కల్యాణ్, సమంత జంటగా నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

అదేమిటంటే…పవన్ కల్యాణ్ కు సిగ్గు ఎక్కువని, జనం మధ్యలో షూటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిపడతారని వివరించింది. ముఖ్యంగా ఆయనకు ఎక్కువ మందిలో పాటల షూటింగ్ అంటే ఎక్కడలేని సిగ్గు వచ్చేస్తుందని, అత్తారింటికి దారేది చిత్రం సందర్భంగా స్విట్జర్లాండ్ షెడ్యూల్ లో ఆయన సిగ్గు చూసి తాను నవ్వాపుకోలేకపోయానని సమంత చెప్పింది.

అక్కడి అందమైన లొకేషన్లలో ఓ పాట షూట్ చేస్తుండగా, చాలామంది జనం వచ్చారని, వాళ్లను చూసిన పవన్ తాను స్టెప్పులు వేయలేనంటూ కారవాన్ వద్దకు వెళ్లిపోయారని వెల్లడించింది. అయితే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్లి “పవన్ నువ్వు చేయగలవు!” అని కాన్ఫిడెన్స్ నింపడం, “నేను చేయగలనంటావా!” అంటూ పవన్ బెరుకుగా మాట్లాడ్డం చూసి నవ్వుకున్నానని తెలిపింది. పవన్ పవర్ స్టార్ అయినా ఎంతో సాధారణ మనస్తత్వం ఉన్న వ్యక్తి అనిపించిందని, ఆ మనస్తత్వమే పవన్ లో తనకు బాగా ఇష్టమైన అంశమని సమంత వివరించింది.

- Advertisement -

Related Posts

అదృష్టం కొద్దీ అభిజిత్ గెలిచాడట.. మంట పెట్టేసిన మోనాల్

బిగ్ బాస్ షోలో ఉన్నంత వరకు ఒకరకమైన మోనాల్‌ను చూస్తే.. బయటకు వచ్చాక మరో రకమైన మోనాల్‌ను చూస్తున్నట్టుంది. బయటకు వచ్చాక తన పరిస్థితి తాను ఏ స్థానంలో ఉందో తెలుసుకుంది. తన...

కులం పేరుతో పిలిచిన నిర్మాత.. స్టేజ్ మీదే కరెక్ట్ చేయించిన జగపతిబాబు

జగపతి బాబు కులానికి వ్యతిరేకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా కులాల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలోనూ కుల భావన ఉంది గానీ తనకు మాత్రం అలాంటి...

ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ముంబైకి బయల్దేరిన మహేష్ బాబు

మహేష్ బాబు ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మంచు విష్ణు భార్య వెరానిక బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో సహా ఆ పార్టీలో...

రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ …”లైగ‌ర్” విజయ్ ఫ‌స్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రంగంలోకి దిగేసాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌...

Latest News