‘నన్ను దోచుకుందువటే’ ఫస్ట్‌లుక్‌ విడుదల

‘సమ్మోహనం’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. సుధీర్ ప్రొడక్షన్ పేరుతొ కొత్త నిర్మాణ సంస్థను సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా రూపొందిస్తున్న చిత్రంలో ఆయనే హీరోగా నటిస్తుండడం విశేషం. ‘నన్ను దోచుకుందువటే’ అనే పేరుతొ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో కథానాయిక టేబుల్ పై కూర్చుని వయ్యారంగా సెల్ఫి తీసుకుంటే, పక్కనే ఉన్న సుధీర్ ఆమెను వెటకారంగా చూస్తుండడం కనిపిస్తుంది. సరికొత్త కథనంతో రూపొందించిన సినిమా ఫస్ట్ లుక్ బాగుందని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఆర్ ఎస్ ఎస్ నాయకుడు దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. అజనీభాష్ బాణీలు సమకూరుస్తున్నారు. మరోపక్క ఆకాశం వైపునకు ఇదే నా తొలి అడుగు, తొలి విమానం. నా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ ఫస్ట్‌లుక్‌ ఇదిగో..!’ అని ట్వీట్‌ చేశారు సుధీర్.