ద‌స‌రాని టార్గెట్ చేసిన `కేజీఎఫ్ 2`!

సైలెంట్‌గా వ‌చ్చి ట్రెండ్ సెట్ చేసే సినిమాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన మోన్‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మాస్ హీరోగా వున్న య‌ష్‌ని పాన్ ఇండియా స్థాయి స్టార్‌గా నిల‌బెట్టింది. క‌న్న‌డ చిత్ర చ‌రిత్ర‌లోనే స‌రికొత్త చ‌రిత్ర‌ని సృష్టించి యావ‌త్ భార‌తం క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ వైపు ఆశ్చ‌ర్యంతో తొంగి చూసేలా చేసింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి జాతీయ స్థాయిలో అవార్డుల్ని సైతం సొంతం చేసుకుంది.

తొలి భాగం సంచ‌ల‌నం సృష్టించ‌డంతో చాప్ట‌ర్ 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో `కేజీఎఫ్ -2`ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు. చాప్ట‌ర్ -1 ఎక్క‌డ ఎండ్ అయిందో అక్క‌డి నుంచే చాప్ట‌ర్ 2ని మొద‌లుకానుంది. న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ తొలి భాగానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరించారు. అయితే రెండ‌వ భాగానికి మాత్రం ఆయ‌న పేరుని తొల‌గించారు. విజ‌య్ కిరంగ‌దూర్ నిర్మిస్తున్నా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 23న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.

తెలుగులో సాయి కొర్ర‌పాటి రిలీజ్ చేస్తున్న ఈ చిత్రాన్ని త‌మిళంలో విశాల్ రిలీజ్ చేస్తున్నాడు. ఇక హిందీలో బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్‌ఖాన్‌, ఫ‌ర్హాన్ అక్త‌ర్ సంయుక్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు. సంచ‌య్‌ద‌త్ విల‌న్‌గా, ర‌వీనా టాండ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని ఇటీవ‌లే పూర్తి చేశారు. మిగ‌తా స‌న్నివేశాల్నిపూర్తి చేసి గ్రాండ్‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంని మించి చాప్ట‌ర్ 2 వుంటుద‌ని ఇప్ప‌టికే ఫీల‌ర్స్ వదులుతుండ‌టంతో బిజినెస్ భారీ స్థాయిలో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.