దిల్‌రాజుకు అభ‌య‌మిచ్చిన ప‌వ‌ర్‌స్టార్‌

Pawan Kalyan plans big thing for Janasena

దిల్ రాజుకు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌ధ్య చెడింది. ఆ కార‌ణంగా సినిమా ప్రారంభానికి ముందు లీకుల విష‌యంలో ప‌వ‌న్ సీరియ‌స్ అయ్యారు. దీంతో సెట్‌లో దిల్ రాజు మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. ఇది నిన్న‌టి మాట.. దిల్ రాజు కోసం ప‌వ‌న్ ఇప్పుడు బెట్టుచేయ‌డం లేదు. త‌ను ఏది చెబితే అదే చేద్దాం అంటున్నాడు.

గ‌త రెండేళ్లుగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ని ఓ ప్లాన్ ప్ర‌కారం త‌క్కువ స‌మ‌యంలో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశారు. ఇది ఎంత త్వ‌ర‌గా పూర్త‌యితే అంత త్వ‌ర‌గా క్రిష్ సినిమా కోసం ప‌వ‌న్ డేట్స్ కేటాయించే వీలుంటుంది. క్రిష్ మూవీ భారీ స్కేల్ వున్న‌ది కాబ‌ట్టి దానికి డేట్స్ ఎక్కు‌వ‌గా అవ‌స‌రం.

ఆ కార‌ణంగానే `వ‌కీల్ సాబ్‌`ని ఫాస్ట్‌గా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా కార‌నంగా ప్లాన్ మొత్తం తారుమారైంది. దీంతో లాక్‌డౌన్ త‌రువాత ఎక్క‌డ త‌న సినిమాని ప‌క్క‌న పెట్టి క్రిష్ సినిమాకి ప‌వ‌న్ వెళ్లిపోతాడేమోన‌ని దిల్ రాజుకు భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. ఆ విష‌యం తెలిసిన ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్‌` పూర్త‌యిన త‌రువాతే క్రిష్ సినిమాకు వెళ‌తాన‌ని, ఆ విష‌యంలో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అభ‌య‌మిచ్చాడ‌ట‌. దీంతో దిల్ రాజు ఊపిరి పీల్చుకున్నాడ‌ని చెబుతున్నారు.