కరోనా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఏదీ అసాధ్యం అన్న వాళ్లు దాన్నే సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటి పట్టునే వుంటున్న వాళ్లంతా ఇంటి నుంచే వీడియోలు చేస్తున్నారు. బయట అడుగుపెట్టకుండానే సినిమాని కూడా నిర్మించొచ్చనినే విధంగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
దీనికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆద్వర్యంలో రూపొందిన `ఫ్యామిలీ` షార్ట్ ఫిల్మ్ దీనికి శ్రీకారం చుట్టింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇల్లు కదలకుండానే చిన్న స్టార్స్ కూడా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో క్రేజీ హీరోయిన్ త్రిష చేరింది. అయితే తాను అందరిలా షార్ట్ ఫిల్మ్ చేయడం లేదు. ఏకంగా ఫిల్మ్ మేకింగే నేర్చుకుంటోంది.
కెమెరా ఎలా ఉపయోగించాలో, 4కె తో ఎలా షూట్ చేయాలో వీడియో కాల్ ద్వారా దర్శకుడు గౌతమ్ మీనన్ త్రిషకు పాఠాలు నేర్పుతున్నారు. ఈ విషయాన్ని, దీనికి సంబంధించిన ఓ వీడియోని త్రిష సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో త్రిష `విన్నయ్‌తాండి వరువాయ`, ఎన్నై అరిందాల్ చిత్రాల్లో నటించింది.
https://twitter.com/trishtrashers/status/1256200810611896320