త్రివిక్రమ్ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయమా?

అల్లు అర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురంలో’ అనే కుటుంబ కథా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది . ఇందులో పల్లెటూరి కుర్రాడు మరియు సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా రెండు పాత్రల్లో బన్నీ కనిపిస్తాడు.

సాఫ్ట్‌వేర్ కుర్రాడితో సాగే లవ్‌ట్రాక్‌లో పూజాహెగ్డే కనిపిస్తుందట. ద్విపాత్రాభినయంలో మరి పల్లెటూరి కుర్రాడికి ఫిమేల్ రోల్ ఎవరు? అసలు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాలో
నివేదా పేతురాజ్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమా త్రివిక్రమ్ -బన్నీ కి హ్యాట్రిక్ ఇస్తుందని అంచనా.