సహజంగా భక్తితో కొందరు, కోరికలు తీరాయని, తీర్చాలని మరి కొందరు తిరుమల కొండ నడిచి ఎక్కుతారు. దానికి మన సెలెబ్రిటీలు అతీతులు కారు. తాజాగా హీరోయిన్ సమంత అదే పని చేసింది. ఆమె సినిమా ‘ఓహ్ బేబీ’ సినిమా జులై 5 విడుదల అవుతుండడం తో సినిమా విజయవంతం కావాలని కావచ్చు.
ఎందుకంటే ఆమె తన ముందరి సినిమా ‘మజిలీ’ విడుదల కు ముందు కూడా ఇదే పని చేసింది. ఆ సినిమా విజయవంతం కావడంతో సెంటిమెంట్ అయినట్టుంది. ఏది ఏమైనా తన స్నేహితురాలు వీజె రమ్య సుబ్రమణియన్ తో ఆమె కొండ పై కనిపంచినప్పటి ఫోటో ఇది.