డైరెక్టర్ చేతుల మీదగా ‘నీవెవరో’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

 

టాలీవుడ్‌ లో మంచి ఫామ్ లో ఉన్న ఆది… విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగులో తన పేరును బాగానే సంపాదించుకున్నారు. పినిశెట్టి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆది, తన ‘నిన్నుకోరి’ సినిమాలో పాజిటివ్‌ క్యారెక్టర్‌తో అందరిని ఆకట్టుకొని మెప్పించాడు. ఇప్పుడు అదే టీం రూపొందిస్తున్న మరో సినిమాలో హీరోగా అలరించనున్నాడు. రచయిత కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న నీవెవరో సినిమాలో ఆది హీరోగా నటించనున్నాడు.

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా యొక్క ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభించబడుతుంది.