అమెరికాకు చెందిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ భారతీయ ఎంటర్టైన్మెంట్ మార్కెట్‌ని ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడి లోకల్ కంటెంట్‌పై దృష్టిపెట్టిన ఈ రెండు డిజిటల్ దిగ్గజాలు ఈ మార్కెట్లో మేజర్ వాటాని ఆక్రమించాలని ఇటీవలే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఉత్తరాదిలో ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. దీన్ని గమనించిన ఉత్తరాదికి చుందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లని రంగంలోకి దింపేశాయి.
ఏక్తా కపూర్‌కి చెందిన ఆల్ట్ బాలాజీ, జీ ఇండియా పరివార్‌కు చెందిన జీ5..నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తో పోటీపడుతున్నాయి. దక్షిణాదిలోనూ వీటి ప్రభావం మొదలుకావడంతో ఆలస్యంగా తేరుకున్న టాలీవుడ్ దిగ్గజాలు సొంత కుంపటి పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాయి. అల్లు అరవింద్, మాట్రిక్స్ ప్రసాద్, మై హోమ్ గ్రూప్ అధినేత మైహోమ్ రామేశ్వరరావుతో పాటు సీక్రెట్ పార్ట్నర్గా దిల్‌రాజు కలిసి ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని స్టార్ట్ చేశారు. దీనికి తాజాగా `అహా` అనే పేరుని ఫిక్స్ చేసినట్టు తెలిసింది.
దీనిపై ఇప్పటికే వెబ్ సిరీస్‌ల నిర్మాణాన్ని ప్రారంభించారు. లోకల్ కంటెంట్‌ని ఎక్కువగా ప్రోత్సహించి కొత్త తరహా వెబ్ సిరీస్‌లని అందించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు చిన్న సినిమాల
స్ట్రీమింగ్‌ని కూడా చేయబోతున్నారట.