‘చాణక్య’ ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్ … ట్రేడ్ షాక్

గోపీచంద్ కు ఇంకా బ్యాడ్ పీరియడ్ పోలేదు

యాక్షన్ హీరో గోపీచంద్ గత కొంతకాలంగా కెరీర్ పరంగా హిట్ అనేది లేకుండా మనుగడ సాగిస్తున్నాడు. అయినా సరే మెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరా పై ధైర్యంగా తన తాజా చిత్రం చాణుక్య ని రిలీజ్ చేసారు. గోపీచంద్ ధైర్యానికి అంతా ఆశ్చర్యపోయారు. అతని తన సినిమా మీద ఉన్నది కాన్ఫిడెన్సా లేక సైరా చిత్రంపై అపనమ్మకమా అని డిస్కషన్ జరిగింది.

సోషల్ మీడియాలో చాలా మంది మెగాభిమానులు…అంత సీన్ లేదంటూ కామెంట్స్ సైతం చేసారు. అందుకు తగ్గట్లు గానే ఈ సినిమా కనీస ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. అతను సినిమా వచ్చినట్లుగా జనం పట్టించుకోలేదు. చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయినట్లే తెలియదు. అసలు ప్రీ రిలీజ్ బజ్ లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో నేడు స్పై థ్రిల్లర్ చాణక్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా సైరా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న తరుణంలో. దాంతో గోపీచంద్ కు ఉన్న ప్రతికూలతలను అధిగమించి హిట్ అందుకుంటాడా అని అంతా ఎదురూచూసారు. అయితే కేవలం 1.75 కోట్లు షేర్ ..రెండు రోజుల్లో రావటంతో అందరి ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.

తొలి రోజు అయిన శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి కూడా రాబట్టలేకపోయింది. రెండో రోజు కూడా అదే పరిస్దితి. దాంతో ఇంత తక్కువ రావటంతో ట్రేడ్ షాక్ అయ్యింది. దాంతో అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. చాణుక్య రిజల్ట్ …ఆ నిర్మాతల తదుపరి చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఖచ్చితంగా పడుతుందనటంలో సందేహం లేదు.