కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఎన్నడూ చూడని చిత్రాలు, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. లాక్డౌన్ ని దేశావ్యాప్తంగా మరో 19 రోజులు పొడిగించడంతో ఇంటి నుంచి ఇక బయటికి వచ్చే రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిపోయిన స్టార్స్ కొంత మంది వంటలు చేస్తూ వైఫ్స్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా వుంటే హీరోయిన్స్ మాత్రం మరో రకంగా నెటిజన్స్‌ని, ఫ్యాన్స్‌ని బుట్టలో వేసే పనిలో బిజీ అయిపోయారు.
ఈ పనిలో అందరికంటే ముందు వరుసలో నిలుస్తోంది పూజా హెగ్డే. జార్జియా వెళ్లొచ్చిన దగ్గరి నుంచి హోమ్ క్వారెంటైన్‌కే పరిమితమైపోయి చిత్ర విచిత్రమైన వంటకాలతో నెలిజన్స్ని ఆకట్టుకుంది. ఇక టీ షర్ట్ ఎలా వేసుకోవాలో తలక్రిందులగా నిలుచుని ఓ వీడియో చేసి సాటి హీరోయిన్లని ఛాలెంజ్ విసిరింది.
అక్కడితో ఆగని పూజా క్వారెంటైన్ టైమ్‌ని తన డ్రెస్సింగ్ స్టైల్‌తో మరింతగా హీటెక్కించేస్తోంది. షార్ట్స్‌లో దర్శనమిస్తూ హాట హాట్ సెల్ఫీలని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫొటోలు వైరల్‌గా మారాయి. పూజా ఫొటోలు చూసిన నెటిజన్స్ అంతా క్వారెంటైన్ టైమ్ మరీ ఇంత హాటా అంటూ అవాక్కవుతున్నారు.