కొత్త ఏడాది 2020 నాదే : అక్కినేని నాగచైతన్య

కొత్త ఏడాది 2020 నాదే అంటున్నాడు యువతరం హీరో అక్కినేని నాగచైతన్య. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు అక్కినేని నాగచైతన్య. ఇటీవల ఓ సందర్భంలో కలిసినప్పుడు నాగ చైతన్య ఇలా.. మనసు విప్పారు.” ప్రస్తుతం ప్రేక్షకులకు నచ్చే సినిమాల్లో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. ఏం మాయ చేశావే, 100%లవ్, తడాఖా, ఒక లైలాకోసం వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అన్నింటికీ మించి తాతగారు, నాన్నగారితో చేసిన మనం సినిమా నాకు చాలా సంతృప్తినిచ్చింది. నా కెరీర్‌లో అది మెమొరబుల్ సినిమా అని చెప్పచ్చు.ఇక ఈ కొత్త ఏడాది 2020 విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కనున్న సినిమాలు నానుంచి రాబోతున్నాయి. ఈ సినిమాలు కచ్చితంగా నాకు మంచి గుర్తింపునిస్తాయన్ననమ్మకం వుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమాల్లోనే నటించాలని ఉంది” అన్నారు.