సంక్రాంతి బరిలో ఇప్పటి వరకు విడుదలైన టాప్ స్టార్స్ చిత్రాలు మొత్తం మూడు ఒక `దర్బార్`, రెండు `సరిలేరునీకెవ్వరు`, `అలవైకుంఠపురంలో` ఈ మూడు చిత్రాల్లో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ నటించిన `అలవైకుంఠపురంలో చిత్రం సూపర్‌డూపర్ హిట్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని, టాలీవుడ్ లోని అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాల పై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా రెండు రాష్ట్రాలతో పాటు అటూ ఓవర్సీస్లో కూడా ఇరగదీస్తోంది. గతంలో ఈ ఇద్దరీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వచ్చిన సంగతి తెలిసిందే. గత సినిమాల వలే ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. త్రివిక్రమ్, బన్నీ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారనే చెప్పాలి. సాధారణంగా త్రివిక్రమ్‌తో ఏ హీరో పని చేసినా రెండు సినిమాల వరకే హిట్ అవుతాయి. మూడో సినిమా ఆశించినంత ఫలితం రాదన్న టాక్ కూడా ఉంది. గతంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించిన `జల్సా`, `అత్తారింటికి దారేది` సూపర్‌డూపర్ హిట్లైతే… `అరవిందసమేత` చిత్రం ఆశించినంత ఫలితం రాలేదు. అయితే అమెరికా, న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌తో రచ్చ చేస్తోంది. ఆ రెండు దేశాల్లో ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కనివిని ఎరుగని కలెక్షన్స్‌ను రాబడుతోంది.
మన దేశంలో కంటే ఓవర్సీస్లో దీని మార్కెట్ పీక్స్ అనే చెప్పాలి. న్యూజిల్యాండ్‌లో మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాలా అభిప్రాయపడ్డారు. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు కూడా న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టాయి. మరోవైపు ఒకరోజు ముందే విడుదలైన సరిలేరు నీకెవ్వరు అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్ ని అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. అక్కడ ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోందని ఈ కలెక్షన్ల బట్టే అర్ధమవుతోంది. ఇక బన్నీ ఇటీవలె తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మాట చెప్పారు. ఈ కలెక్షన్ల బట్టి అది నిజమనిపిస్తుంది. అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటే నాకు మాత్రం ఆర్మీ ఉంది అన్నారు. అంటే బన్నీ కి ఏ దేవంలోనైనా సరే ఫాలోయింగ్ ఆ రేంజ్లో ఉందనమాట.