ఇషా రెబ్బ మ‌రో కియారా అవుతుందా?

బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు పిల్ల ఇషా రెబ్బ‌. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ప‌రిచ‌యం చేసిన ఈ అచ్చ తెలుగు అమ్మాయి గ‌త కొంత కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. దాని కోసం ఏం చేయ‌డానికైనా.. ఎక్క‌డిదాకా వెళ్ల‌డానికైనా సిద్ధం అనే సంకేతాలిస్తోంది. అయినా పాపం ఆమెని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. స్టార్ హీరోల చిత్రాల్లో న‌టించే ఛాన్సులు వ‌చ్చినా అవి ప్రాధాన్యం లేని పాత్ర‌లే కావ‌డంతో క్రేజీ హీరోయిన్‌ల జాబితాలో చేర‌లేక‌పోయింది.

ఇలా వుంటే ఇక లాభం లేద‌నుకుందో ఏమోగానీ ఏకంగా ల‌స్ట్ స్టోరీస్‌కి రెడీ అయిపోయింది. బాలీవుడ్‌లో కియారా అద్వానీ ఏం చేసినా పట్టించుకోని బాలీవుడ్ మేక‌ర్స్ `ల‌స్ట్ స్టోరీస్‌`లో ఆమె న‌ట‌న చూసి వ‌రుస క్రేజీ ఆఫ‌ర్లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ఈ వెబ్ సిరీస్ త‌రువాత కియారా తెలుగులో వ‌రుస ఆవ‌కాశాల్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు అదే ల‌స్ట్ స్టోరీస్‌ని తెలుగులో నెట్ ఫ్లిక్స్ రీమేక్ చేస్తోంది. సంక‌ల్ప్‌రెడ్డి, నందినిరెడ్డి, త‌రుణ్‌భాస్క‌ర్ నాలుగు భాగాల‌ని డైరెక్ట్ చేస్తున్నారు.

కియారా న‌టించిన సిరీస్‌ని తెలుగులో సంక‌ల్ప్‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో కియారా పాత్ర‌లో ఇషా రెబ్బ న‌టిస్తోంది. హిందీకి మించి హాట్‌గా ఈ సిరీస్ వుంటుంద‌ట‌. ఈ సీరీస్‌కు సంబంధించిన సీన్‌ల‌లో ఇషా టూ హాట్‌గా న‌టించింద‌ని ఇన్ సైడ్ టాక్‌. దీంతో అయినా ఆమెకు తెలుగులో అవ‌కాశాలు పెరుగుతాయో చూడాలి.