ఇచ్చ‌ట పాత రికార్డులు స‌వరించ‌బ‌డును!

ప‌వ‌న్ నుంచి సినిమా వ‌చ్చి రెండేళ్ల‌వుతోంది. ఇంత గ్యాప్ వ‌చ్చింది.. రాజ‌కీయాల్లోకి వెళ్లాక ప‌వ‌న్ క్రేజ్ త‌గ్గిందా? అనే అనుమానాలు అంద‌రిలో మొద‌ల‌య్యాయి. ఆ అనుమాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్‌` ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాతో ప‌వన్ మ‌ళ్లీ యాక్ష‌న్ మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ తో పాటు ప‌వ‌న్ ఫ‌స్ట్‌లుక్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

అంతా ఊహించిన‌ట్టే ఈ చిత్రానికి `వ‌కీల్ సాబ్‌` టైటిల్‌ని చిత్ర బృందం క‌న్ఫ‌ర్మ్ చేసింది. ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది. దీనిపై సెల‌బ్రిటీల‌తో పాటు ఫ్యాన్స్ ట్వీట్‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సంచార జీవిగా ఓ ట్ర‌క్‌పై ప‌వ‌న్ ప‌డుకుని కాళ్లు బోర్లించిన కుర్చీసై బారుగా చాపి, క‌ళ్ల‌కు బ్లాక్ గాగుల్స్ ధ‌రించి అంతా బ్లాక్ డ్రెస్‌లో ప‌వ‌న్ లుక్ కిర్రాక్‌గా వుంది. ఇంకా చెప్పాలంటే స్టైల్‌కా బాప్ అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. రెండేళ్లైనా బాస్‌లో గ్రేస్ త‌గ్గ‌లేద‌ని, ఎన్నాళ్ల కెన్నాళ్ల‌కి…గ్యాప్ వ‌చ్చినా ఆ స్టైల్‌.. ఆ స్వాగ్ ఏమాత్రం త‌గ్గ‌లా.. మే త్వ‌ర‌గా వ‌చ్చెయ్య‌మ్మా… అంటూ ప‌వ‌న్ నెంబ‌ర్ వ‌న్ ఫ్యాన్ నితిన్ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా వుంటే యంగ్ డైరెక్ట‌ర్ మారుతి చేసిన ట్వీట్ ఆక‌ట్టుకుంటోంది. రెండేళ్లుగా ప‌వ‌న్ రికార్డుల జోలికి వెళ్ల‌లేదు. అయితే ఈ సినిమా ఆ రికార్డుల్ని తిర‌గ‌రాస్తుంద‌నే అర్థం స్పురించేలా ఇచ్చ‌ట పాత రికార్డులు స‌వ‌రించ‌బ‌డును అని మారుతి చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్‌ని కొత్త కోణంలో ఆవిష్క‌రిస్తున్న ఈ మూవీ మేలో రిలీజ్ కాబోతోంది.