మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..నటుడు అరెస్ట్
తమ కోరికలు తీర్చుకోవటానికి సినిమాని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూంటారు కొందరు. అమ్మాయిలను సినిమా ఆపర్స్ పేరుతో లోబర్చుకుని మోసం చేస్తూంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో మరీ కామన్ అయ్యిపోయాయి. తాజాగా మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఓ నటుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఫోటో షూట్ పేరుతో బాలికను ఇంటికి పిలిచి లైంగికంగా వేధించిన ఘటన పుణెలో చోటు చేసుకుంది. బాలిక ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు…35 ఏళ్ల మందార్ కులకర్ని మరాఠీలోని పలు టీవీ షోలలో నటిస్తుంటాడు. బాధిత బాలిక ఆరు నెలల క్రితం అతనిని పుణెలోని యాక్టింగ్ స్కూల్ కలిశానని తెలిపింది. ఈ పరిచయం కొద్ది మందార్ సదరు బాలికకు ఓ రోజు ఫోన్ చేసి ఓ టీవీ షోకి అడిషన్స్ జరుగుతున్నాయని.. బాధితురాలి ఫొటోలు కావాలని చెప్పాడు. అందు కోసం ఆమెను ఫొటో షూట్ చేయాలని.. తానే ఉచితంగా ఫోటో షూట్ చేస్తానని చెప్పి తన ఇంటికి రావాల్సిందిగా మందార్, బాలికను ఒప్పించాడు.
ఈ నేపథ్యంలో మందార్ వివిధ రకాల దుస్తులపై తన ఫొటోలు తీశాడని, ఆ తర్వాత బికినిపై కూడా ఫొటోలు కావాలని అడిగాడని బాలిక తెలిపింది. బికినిపై ఫొటోలు తీస్తున్న సమయంలో తన దుస్తుల కొలతలు తీసుకున్నాడని బాలిక ఆరోపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం గూర్చి తన తల్లిదండ్రులకు చెపింది.
దాంతో వెంటనే వారు బాలికను తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లో నటుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ అంశంపై విచారణ జరపగా.. నిందితుడు తన సెల్ ఫోన్లో కూడా బాలిక ఫొటోలు చిత్రించినట్లు తెలింది. దీంతో పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 354 , పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సెల్ఫోన్, ల్యాప్టాప్ స్వాధినం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.