తెలుగు తెర పై వైవిధ్యమైన చిత్రంగా వచ్చిన ‘అ!’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా కాసుల వర్షం కురిపించకపోయినా ఇందులోని నటీమణులకు మంచి గుర్తింపు వచ్చింది. మొదటి చిత్రం గా దర్శకత్వం చేసిన ప్రశాంత్ వర్మ కు మంచి అవకాశాలే వచ్చాయి.
అలాంటి సినిమాని వదలకుండా మళ్ళీ దానికి సీక్వెల్ తీసే ప్రణాళికలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మళ్ళీ ఈ సీక్వెల్ లో కాజల్ అగర్వాల్ మరియు తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నారని సమాచారం. మరి ఈ సినిమాను నిర్మించేదెవరో, ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూద్దాం.