Home Tollywood 'అల వైకుంఠపురంలో' లో పూజ హెడ్గే పాత్ర ఇదే

‘అల వైకుంఠపురంలో’ లో పూజ హెడ్గే పాత్ర ఇదే

అల్లు అర్జున్ కు బాస్ గా పూజ హెడ్గే

మెగాహీరో వ‌రుణ్‌తేజ్  పరిచయ చిత్రం ముకుంద చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డె ఆ తర్వాత మెగా క్యాంప్ తో కంటిన్యూ అవుతోంది. అయితే చిత్రంగా త‌న న‌ట‌న‌తో కంటే స్కిన్ షోతోనే అవ‌కాశాలు కొట్టేస్తోంది. గ‌త ఏడాది అల్లు అర్జున్‌తో న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథం హిట్ అవ‌డంతో ఈ హాట్ బ్యూటీకి టాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి. తాజాగా ఆమె అదే అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో చిత్రం చేస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో ఆమె సాప్ఠ్ వేర్ కంపెనీ సీఈవో గా కనిపించబోతోందని సమాచారం.ఆ కంపెనీలో అల్లు అర్జున్ జాబ్ చేస్తారు. వీళ్లిద్దరి మధ్యా లవ్ స్టోరీ నడవనుంది. దాంతో ఆమె కార్పోరేట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనుంది. రేపు అక్టోబర్ 13న ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఈ లుక్ తో ఓ పోస్టర్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె రిలీజైన సామజవరగమన సాంగ్ లో దుమ్ము రేపింది. ప్రముఖ పాటలు రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ పాటకి తమన్ స్వరాలు అందించారు. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

‘అల వైకుంఠపురములో” ని తారలు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్, పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

<

p style=”text-align: justify”>సాంకేతిక నిపుణులు:డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,ఫైట్స్: రామ్ – లక్ష్మణ్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్,నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు).

- Advertisement -

Related Posts

అదృష్టం కొద్దీ అభిజిత్ గెలిచాడట.. మంట పెట్టేసిన మోనాల్

బిగ్ బాస్ షోలో ఉన్నంత వరకు ఒకరకమైన మోనాల్‌ను చూస్తే.. బయటకు వచ్చాక మరో రకమైన మోనాల్‌ను చూస్తున్నట్టుంది. బయటకు వచ్చాక తన పరిస్థితి తాను ఏ స్థానంలో ఉందో తెలుసుకుంది. తన...

కులం పేరుతో పిలిచిన నిర్మాత.. స్టేజ్ మీదే కరెక్ట్ చేయించిన జగపతిబాబు

జగపతి బాబు కులానికి వ్యతిరేకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా కులాల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలోనూ కుల భావన ఉంది గానీ తనకు మాత్రం అలాంటి...

ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ముంబైకి బయల్దేరిన మహేష్ బాబు

మహేష్ బాబు ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మంచు విష్ణు భార్య వెరానిక బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో సహా ఆ పార్టీలో...

రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ …”లైగ‌ర్” విజయ్ ఫ‌స్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రంగంలోకి దిగేసాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌...

Latest News