అక్కినేని అఖిల్ సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చే ముందు ఎంత హంగామా చేశాడో వచ్చాక అంత సైలెంట్ అయిపోయాడు. అందరి హీరోలకు భిన్నంగా సినిమాల్లో ఎంట్రీకి ముందే కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్‌లో నటించి రచ్చ చేసిన అఖిల్ సినిమాల్లోకి వచ్చాక మాత్రం షాపింగ్ మాల్స్ యాడ్స్ మినహాయించి ఒక్కటంటే ఒక్క కమర్షియల్ యాడ్‌లో కనిపించలేదు. అంతలా అతని క్రేజ్ పడిపోయింది. `అఖిల్`తో తన సినీ జర్నీని మొదలుపెట్టిన అఖిల్ ఆ తరువాత చేసిన హల్లో, మిస్టర్ మజ్ను ఆశించిన స్థాయి విజయాన్ని దక్కించుకోలేకపోయాయి.
ఎక్కడుంది లోపం?. అఖిల్ ఓవర్‌గా ఫీలవుతున్నాడా?. తెరపై నటించడం లేదా?. లేక అఖిల్ నటిస్తున్నాడనే ఫీల్‌ని జనాల్లో కలిగించడంలో ఫెయిల్ అవుతున్నాడా? అని విశ్లేషించిన నాగ్ కొత్తగా అతని బాధ్యతల్ని బన్నీవాసుకి అప్పగించారు. సక్సెస్‌లలో వున్న బన్నీవాస్ ప్రస్తుతం అఖిల్ హీరోగా నిర్మిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ ఇద్దరికి ఈ సినిమా లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. అఖిల్‌కి హిట్టు కావాలి. బొమ్మరిల్లు భాస్కర్‌కి హిట్టు కాదు అతనికిది ఫైనల్ కాల్. ఇదీ పోయిందో ఇక అతనికి సినిమా ఇచ్చే నాధుడువుండరు.
అందుకే చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్నిబొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్నాడు. ఇటీవలే టైటిల్ ని రిలీజ్ చేసిన చిత్ర వర్గాలు తాజాగా అఖిల్ ఫస్ట్ లుక్ స్టిల్‌ని రిలీజ్ చేశారు. బాధలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుస్తున్న రోమియోలా అఖిల్ కొత్తగా కనిపిస్తున్నాడు. కంప్లీట్‌గా అతని లుక్కే మారిపోయింది. హైదరాబాద్, అమెరికాలో షూటింగ్ చేశారు. ఈ నెల 15 నుంచి తాజా షెడ్యూల్ మొదలుకాబోతోంది. సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయిన అఖిల్ హిట్ కొట్టేనా అని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.