అందుకే రకుల్ కొంప మునిగింది!? 

 

అందుకే రకుల్ కొంప మునిగింది!? 

అందంకన్నా అభినయమే మిన్న అన్న చిత్రోక్తిని ఒకింత ఆలస్యంగా అర్థం చేసుకున్నట్టుంది రకుల్ ‌ప్రీత్ సింగ్. అందంకంటే అభినయానికి ప్రాధాన్యమంటూ  ముందుతరం హీరోయిన్లు ఎందుకు చెప్పేవారో ఇప్పుడు అర్థమైనట్టుంది ఈ పంజాబీ బ్యూటీకి.
 
స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేసినా ఒకేతరహా గ్లామర్ రోల్స్ ఏకబిగిన చేయడం వల్లే కెరీర్ కొంపమునిగిందన్న గ్రహింపుకొచ్చిందట ఈ జిమ్ ఫ్రీక్ బ్యూటీ. తనతోపాటు స్క్రీన్ కెరీర్ మొదలెట్టిన మిగితా హీరోయిన్లతో పోలిస్తే, రకుల్ చాలా వేగంగానే ఎదిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కాకపోతే, అంతే వేగంగా కనుమరుగైంది. ఎన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నా  రకుల్‌కి పిలిచ్చి చాన్సిచ్చేవాళ్లే కనిపించటం లేదు.
 
అదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ  వరుసగా గ్లామర్ రోల్స్‌ చేసి అందాలను ఆరబోయటమే కెరీర్‌కు చేటొచ్చింది. నటనకు ఆస్కారమున్న పాత్రలపై దృష్టి పెట్టలేకపోయా నన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది రకుల్. బోల్డ్ గ్లామర్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎంత తప్పో  చాన్స్‌లు కాలాక అర్థమైందన్నది రకుల్ మాట. ‘నిర్మాతలకు అనుకూలమైన హీరోయిన్‌ని, పంక్చ్యువాలిటీ నన్ను చూసే నేర్చుకోవాలి’ లాంటి కబుర్లెన్ని చెబుతున్నా రకుల్‌కు మళ్లీ టాలీవుడ్‌లో ఆ ప్లేస్, స్పేస్ దొరకడం కష్టమనే అంటున్నారు!?