చిత్రం: ఓసీ
నటీనటులు: హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి, రాయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ తదితరులు.
కొరియోగ్రాఫర్: సత్య మాస్టర్
సంగీత దర్శకుడు: భోలే శివాలి
సినిమాటోగ్రఫీ: సాయిరాం తుమ్మలపల్లి
దర్శకత్వం: విష్ణు బొంపెల్లి
నిర్మాత: బీవీఎస్
బ్యానర్: కౌండిన్య ప్రొడక్షన్స్
పీఆర్ఓ: హరీష్, దినేష్
విడుదల: 07/06/2024
కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓసీ. కేవలం డబ్బులు ఉన్నంత మాత్రానా హీరోలు కాలేరు ట్యాలెంట్ ఉంటే ఎవరైనా స్టార్లు కావచ్చు అని ట్రైలర్‌లో, ప్రచార చిత్రాల్లో చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్శించారు. దీంతో ఓసీ డిసెంట్ ఫిల్మ్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో క్రియేట్ చేసుకున్నారు. మంచి అంచనాల నడుము నేడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంత వరకు మెప్పించిందో సమీక్షిద్దాం.
కథ:
ఓ బస్తీలో అనాథలైన రాక్ (హరీష్ బొంపెల్లి), మాగ్నైట్ (రాయల్ శ్రీ), కమల్ హాసన్ (లక్ష్మీ కిరణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీరికి నర్సింగ్ అనే వ్యక్తి అండగా ఉంటాడు. బస్తీలో చిన్న చితక పనులు చేసుకునే వీరు ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని తపత్రయ పడుతుంటారు. రాక్ కు బాలరాణి(మాన్య సలాడి)తో మంచి స్నేహం ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు సినిమా ఆడిషన్స్ ఇస్తుంటారు. సందీప్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అవుతాడు, మందు ఇప్పిస్తే అవకాశం ఇప్పిస్తా అంటాడు. ఇలా కొన్ని సార్లు జరిగిన తరువాత ఈ ముగ్గురి దగ్గర డబ్బులు ఉండవు. దాంతో బాబు రావు అనే గల్లీ రౌడీని బురిడి కొట్టిస్తారు. దీంతో వీరికి కష్టాలు మొదలౌతాయి. వీరికి అండగా ఉన్న నర్సింగ్‌ను చంపేస్తారు. దీంతో వీరు ప్రాణ భయంతో పారిపోతారు. అలా పారిపోయిన వీరు తమ లక్ష్యం కోసం ఏం చేశారు. బాబురావు నుంచి ఎలా తప్పించుకున్నారు. ఇంతకీ సినిమా అవకాశం వచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే ఓసీ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా రంగం నేపథ్యంలో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. అయినా దేనికదే ప్రత్యేకమైనది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఈ కథ రాసుకున్న తీరు బాగుంది. ఫస్ట్ ఆఫ్ అంతా చాలా కామెడీతో తమ లక్ష్యం కోసం ప్రయత్నించే కుర్రాళ్లు, హీరోయిన్ వచ్చే చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ మెప్పించాయి. అలాగే సినిమా ఆడిషన్స్‌లో జరిగే కామెడీని బాగా చూపించారు. ఇంటర్వెల్ వచ్చే ఫైట్ సీన్ చాలా బాగుంది. ముగ్గురు కలిసి చేసే ఫైట్ సీన్ కమర్షల్ సినిమాను తలపిస్తుంది.
ఇక సెకండ్ ఆఫ్ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. కావాల్సినంత ఎమోషన్ ఉంటుంది. సినిమే ప్రపంచం అని బతికే కుర్రాళ్లు ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది బాగా చూపించారు. తమ లక్ష్యం, మధ్యలో రివేంజ్, స్నేహం ఈ ముడింటిని బ్యాలెన్స్‌డ్‌గా కథ నడిపించిన తీరు మెప్పిస్తుంది. క్లైమాక్స్ చాలా భావోధ్వేగానికి గురిచేస్తుంది. చూసే ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిళ్లుతాయి. కాకపోతే అక్కడక్క కాస్త ఎడిటింగ్ షార్ప్‌గా కట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది.
నటీనటులు:
హీరోగా నటించిన హరీష్ బొంబెల్లి వెండితెరకు నూతనంగా పరిచయం అయినా యాక్టింగ్ పరంగా మెప్పించారు. చాలా మెచ్యూర్‌డ్ గా నటించారు. యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టాడు. అలాగే కొన్ని సీన్స్ లో అద్భుతంగా చేశాడు. ఆడిషన్స్ ఇచ్చే సీన్స్ చాలా బాగా చేశాడు. కచ్చితంగా వెండితెరపై మంచి క్యారెక్టర్లు పడితే నిలుచుండిపోయే ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ అద్భుతంగా నటించారు. వీరిద్దరిది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు. తెరపై కనిపించిన ప్రతీసారి మెప్పించారు. అలాగే హీరోయిన్ మాన్య సలాడిది కూడా మంచి పాత్రే. ఉన్నంతలో చాలా బాగా చేసింది. అలాగే బాబు రావు పాత్ర చేసిన జీవన్ నవ్వించాడు, కోపం తెప్పించాడు, భయపెట్టాడు. మిగితా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
సాంకేతిక అంశాలు:
ముఖ్యంగా విష్ణు బొంబెల్లి డైరెక్షన్ గురించి చెప్పాలి. ఫస్ట్ సినిమా అయినా ఫర్ఫెక్ట్ టేకింగ్ అని చెప్పాలి. ఎమోషన్స్ పండించడంలో డైరెక్టర్ మంచి మార్కులు కొట్టేశాడు. క్రాఫ్ట్స్ ఉపయోగించుకోవడంలో ఆయన పనితనం కనిపించింది. కచ్చితంగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే సినిమాటోగ్రాఫర్ సాయిరాం తుమ్మలపల్లి కెమెరా యాంగిల్స్, ఫ్రేమ్స్ మెప్పించాయి. తరువాత బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన చైతన్య కొల్లీ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. మంచి ఎలివేషన్స్ కొట్టాడు. సినిమా నిర్మాణం విలువలు కూడా బాగున్నాయి. కథకు తగ్గట్టుగానే ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చిత్రీకరించారు.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
నటీనటులు
డైరెక్షన్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయింది.
రేటింగ్: 3/5