Naa Saami Ranga Movie Review In Telugu: ఓకే.. సామి!

(చిత్రం : నా సామిరంగ, విడుదల: 14, జనవరి-2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్, షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు తదితరులు, దర్శకత్వం: : విజయ్ బిన్ని, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, సంగీత దర్శకులు: ఎం ఎం కీరవాణి, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్)

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సంక్రాంతికి విడుదలైన అగ్ర హీరోల చిత్రాల్లో ‘నా సామిరంగ’ ఒకటి. గ్రామీణ నేపథ్యంలో అక్కినేని నాగార్జున నటించిన ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందే వచ్చిన ట్రైలర్స్ ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. మరి.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది..? అక్కినేని నాగార్జున ఫాన్స్ కు ఎలాంటి ఉత్సాహాన్ని ఇచ్చింది..? అంచనాలను అందుకుందా ..లేదా తెలుసుకుందాం….

కథేంటో చూద్దాం… తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ప్రాంతంలో పేరు మోసిన వ్యక్తి .. అందరూ పెద్దయ్యగా పిలుచుకునే నాజర్ ని ఓ ప్రమాదం నుంచి ఇద్దరు అనాథ పిల్లలైన కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) లు కాపాడుతారు. అక్కడ నుంచి కిష్టయ్యని కూడా తన కొడుకుల్లో ఓ కొడుకుగా పెద్దయ్య ఎంతో పెంచుకుంటాడు. మరి అలా పెంచుకున్న పెద్దయ్య కోసం కిష్టయ్య ఎంతవరకు వెళ్లగలడు? పెద్దయ్య కొడుకుల్లో ఒకడైన దాసు(షబీర్ కల్లరక్కల్) కి కిష్టయ్య కి మధ్య వైరం ఎలా ఏర్పడుతుంది? ఈ క్రమంలో వరాలు(ఆశికా రంగనాథ్) పాత్ర ఏంటి అసలు అంజికి ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: ఈ సినిమాలో మంచి క్యాస్టింగ్ కనిపిస్తుంది. ఒక్కో క్యారక్టర్ కి తగిన పాధాన్యత ఉండడం వల్ల ఆద్యంతం ఒకొకరు తమ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చారు. అలాగే కింగ్ నాగార్జున తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసారని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ లో ఇమిడిపోయారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత మళ్ళీ ఆ తరహా మాస్ క్యారక్టర్ లో తన యాస నడవడిక మెయిన్ గా తన స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ గా ఉన్నాయి. ఆయన యాక్షన్ పార్ట్ అయితే.. సాలీడ్ గా ఉండి అందరి చేత చప్పట్లు కొట్టించింది. నాగార్జునకి జోడీగా నటించిన ఆషికా రంగనాథ్ తన పాత్రలో ఎంతో హుందాగా కనిపించి తన పాత్రలో ఒదిగిపోయింది. గార్జియస్ లుక్స్ సహా నటన పరంగా ఆమె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందిఇక . వీరితో పాటుగా ఈ సినిమాలో అల్లరి నరేష్ కి మరోసారి మంచి పాత్ర లభించింది. తనదైన మార్క్ కామెడీ అనే కాకుండా .. పలు కీలక ఎమోషనల్ సన్నివేశాల్లో అరుదైన నటన కనబరిచి ప్రేక్షకులందర్నీ ఇంప్రెస్ చేసాడు. రాజ్ తరుణ్, మిర్నా, రుక్షర్ దిల్లాన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కటి నటన కనబరిచి మెప్పించారు. విలన్ గా కనిపించిన మరో నటుడు షబ్బీర్ మాత్రం తన పాత్రని సమర్ధవంతంగా పోషించాడు. సినిమాలో సెకండాఫ్ లో ఓ కీలకమైన ఎమోషనల్ సన్నివేశం అయితే ప్రతీ ఒక్కర్నీ కదిలిస్తుంది. అలాగే దానికనుగుణంగా వచ్చే క్లైమాక్స్ సీన్స్ కూడా మంచి మాస్ ఎలిమెంట్స్ తో అలరించింది. ఎక్కడో కొన్ని కొన్ని కామెడీ సీన్స్ మినహా మిగతా అంతా అలా అలా అలాగే సాగింది. నాగార్జున ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఇంకాస్త బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేదనిపించింది. అయితే.. చాలా సన్నివేశాలు మనం ఇదివరకే ఏదో సినిమాలో చూసేసినట్టే అనిపిస్తాయి.

టెక్నీకల్ గా చూస్తే… ఈ సినిమాలో టెక్నీకల్ టీం ఆర్ట్ వర్క్ ని మెచ్చుకోవలసిందే. నిర్మాణ విలువలు భేషుగ్గా ఉన్నాయి. వింటేజ్ బ్యాక్ డ్రాప్ కి కావాల్సిన టోటల్ సెటప్ ని మైంటైన్ చేయడం బాగుంది. కీరవాణి సంగీతం ఓకే . క్లైమాక్స్ లో స్కోర్ మాత్రం చాలా బాగుంది. దాశరధి సినిమాటోగ్రఫి వింటేజ్ ఫీల్ ని తీసుకొస్తుంది. ఎడిటింగ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించాల్సింది. ఇక దర్శకుడు విజయ్ బిన్నీ విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి ఓకే అనిపించే వర్క్ చేసాడని చెప్పాలి. మెయిన్ లీడ్ అందరి నుంచి మంచి పెర్ఫార్మన్స్ లను తాను రాబట్టుకున్నాడు. కానీ కథనంని మాత్రం అంత ఆసక్తిగా అనిపించింది. సినిమా మొత్తంగా చూసుకున్నట్టు అయితే పండుగ కానుకగా వచ్చిన “నా సామిరంగ” నాగ్ ఫ్యాన్స్ కు మాత్రమే మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.. ఓసారి లుక్కేయండి ఫర్వాలేదు.