ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అరుణ్ దర్శకత్వలో తెరకెక్కిన సినిమా ‘లవ్ మీ’. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించగా, స్టార్ కెమెరామెన్ PC శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. లవ్ మీ సినిమా నేడు మే 25న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.
కథ విషయానికొస్తే.. సినిమా మొదట్లో ఓ చిన్న ఊర్లో ఓ ఫ్యామిలీ చూపించి అందులో భార్య, భర్త చనిపోవడం, వాళ్ళ పాప మిగలడం చూపించారు. ఇక అసలు కథలోకి వచ్చాక అర్జున్(ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దయ్యాలు, ఆత్మలు, స్మశానాలు.. ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటారు. ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా(వైష్ణవి చైతన్య) కూడా వీళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఓ రోజు సినిమా మొదట్లో చూపించిన పాప గురించి న్యూస్ అర్జున్ దగ్గరికి రావడంతో ప్రతాప్, ప్రియా రీసెర్చ్ చేసి ఆ పాప పెద్దయ్యాక చనిపోయి దివ్యవతి అనే దయ్యం అయిందని, ఆ దయ్యాన్ని చూడటానికి వెళ్లినవాళ్ళందర్నీ చంపేస్తుందని చెప్తారు. దీంతో అర్జున్ అసలు ఆ దయ్యం కథేంటో చూద్దామని వెళ్లి ఆ దయ్యంతో ప్రేమలో పడతాడు. కానీ అక్కడ ఓ అమ్మాయి ఉందని గ్రహించి మరి చనిపోయింది ఎవరు? అసలు దివ్యవతి ఎవరు అని రీసెర్చ్ చేస్తుంటే మరో ముగ్గురు అమ్మాయిలు చనిపోయినట్టు తెలియడంతో వాళ్ళకి దివ్యవతికి లింక్ ఏంటి అని అర్జున్ వెతకడం మొదలుపెడతాడు. అసలు దివ్యవతి ఎవరు? ఆ ముగ్గురు ఎలా చనిపోయారు? అర్జున్ దయ్యాన్ని ఎందుకు ప్రేమించాడు? ఆ పాపకి దివ్యవతికి సంబంధం ఉందా? దయ్యం అర్జున్ ని ఏం చేసింది? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. సినిమా స్క్రీన్ ప్లే దయ్యమే కథ చెప్తున్నట్టు ఆసక్తికరంగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్, దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్లడం, అక్కడ దయ్యంతో సీన్స్ తో సాగుతుంది, ఇంటర్వెల్ కి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏంటి అనే ఆసక్తిని కలిగిస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ ముగ్గురు అమ్మాయిల గురించి, దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసి కథపై మరింత ఆసక్తి కలిగిస్తారు. కాకపోతే ఆ రీసెర్చ్ కొంచెం కన్ఫ్యూజన్ గా సాగుతుంది. ఇక క్లైమాక్స్ లో వరుస ట్విస్ట్ లు, మళ్ళీ చివర్లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ ఇంకో ట్విస్ట్ తో అదరగొట్టారు. ముందు నుంచి ప్రమోషన్స్ లో చెప్పినట్టు సినిమాలో ఐదారుగురు హీరోయిన్స్ ఉన్నారు. వైష్ణవి, సిమ్రాన్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పాత్రలేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఆశిష్ రౌడీ బాయ్స్ లో కాలేజీ కుర్రాడిగా ఫుల్ ఎనర్జిటిక్ గా కనపడి ఇప్పుడు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఈ సినిమా కోసం ఆశిష్ అడవుల్లో, స్మశానాల్లో చెప్పులు లేకుండా కష్టపడ్డాడు. బేబీతో అందర్నీ ఇంప్రెస్ చేసిన వైష్ణవి చైతన్య మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులని అలరించింది. రవికృష్ణ కూడా ఆశిష్ కి బాగా సపోర్ట్ ఇస్తూ నటించాడు. సిమ్రాన్ చౌదరి స్కెలెటిన్ స్పెషలిస్ట్ గా కనిపించి ఓకే అనిపించింది. కథ మొత్తం వీరి మధ్య తిరుగుతుంది.
సాంకేతిక అంశాలు.. PC శ్రీరామ్ కెమెరామెన్ అంటే ఆ సినిమా విజువల్స్ బాగుంటాయని అందరూ ఫిక్స్ అయిపోతారు. ఈ సినిమా విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. BGM తోనే భయపెట్టారు. పాటలు కూడా బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ లొకేషన్స్ ని చాలా బాగా డిజైన్ చేసారు. కొత్త కథకి ఓ కొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి దర్శకుడిగా అరుణ్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
మొత్తంగా ‘లవ్ మీ’ ఓ దయ్యం కోసం, ఆమె చుట్టూ ఉన్న కథ కోసం హీరో పాత్ర చేసిన రీసెర్చ్, హీరో దయ్యంతో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో ఆసక్తికరంగా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. తప్పక చూడండి.
రేటింగ్: 3