(చిత్రం : గం గం గణేశా, విడుదల తేదీ : మే 31, 2024, రేటింగ్ : 2/5, నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు. దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి, నిర్మాతలు : కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్)
యువతరం హీరో ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ‘గం గం గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : ఓ అనాధ గణేశ్ (ఆనంద్ దేవరకొండ). తన ఫ్రెండ్ (జబర్దస్త్ ఇమాన్యూయల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అటు శ్రుతి (నయన్ సారిక)తో బాగా డీప్ గా ప్రేమలో ఉంటాడు. ఐతే, శ్రుతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేశ్ కి హ్యాండ్ ఇస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో గణేశ్ ఓ డైమండ్ దొంగతనం చేస్తాడు. ఆ డైమండ్ కోసం గణేశ్ ఏం చేశాడు ?, అసలు ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేశ్ విగ్రహంలోకి ఎలా వెళ్ళింది ?, మరో వైపు అదే గణేశ్ విగ్రహంలోకి 100 కోట్లు ఎలా వచ్చాయి ?, అసలు ఆ వంద కోట్లు ఎవరవి ?, ఇంతకీ.. గణేశ్ లైఫ్ లోకి నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ) ఎలా వచ్చింది ?, చివరకు గణేశ్ లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది మిగిలిన సినిమా కథ.
విశ్లేషణ: ‘గం గం గణేశా’ సినిమాలో పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ గానే సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. సినిమాలో దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. మొత్తానికి దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికితోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు కనెక్ట్ కావు. దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలను కూడా ఇంకా బెటర్ రాసుకుని ఉండి ఉంటే బాగుండేది. ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన గణేశ్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన డైమండ్ ట్రాక్.. అలాగే మరోవైపు వంద కోట్లు ట్రాక్.. ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘‘గం గం గణేశా’’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. అలాగే, హీరోయిన్ పాత్రలో నటించిన ప్రగతి శ్రీవాస్తవ కూడా చాలా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. అలాగే మరో హీరోయిన్ పాత్రలో కనిపించిన నయన్ సారిక నటన కూడా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ కామెడీ పర్వాలేదు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ‘‘గం గం గణేశా” అంటూ వచ్చిన ఈ క్రైమ్ కామెడీ సస్పెన్స్ డ్రామాలో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా… సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. అయితే, ఆనంద్ దేవరకొండ నటన అండ్ కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు క్లైమాక్స్ బాగున్నా.., కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
టెక్నీకల్ విషయాలకొస్తే… సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. ఆదిత్య జవ్వాది వాటిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. చిత్ర నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమాఏ వర్గాన్ని ఆకట్టుకోలేకపోయింది.
రేటింగ్ : 2/5