Extra Ordinary Man Movie Review: నటుడి బ్రతుకు నటన

ఒక మంచి ప్రయత్నం , అడవి కాచిన వెన్నెల అయిందేమో అనిపించేలా

ఒక మంచి అవకాశం చేజారిందా అనిపించేలా ..

ఒక నిమిషం బాగుంది అనిపించేంతలో ఇక వద్దు బాబు అనిపించేలా ..

మనల్ని పూర్తిగా అసంతృప్తి తో నింపేసింది

ఈ వారం విడుదల అయిన — Extra Ordinary Man

కథ :

అభినయ్ ఒక jr. ఆర్టిస్ట్ . అవకాశాలు లేకపోయినా ఆనందంగా బతికేస్తూ ఉంటాడు … తండ్రి చేతిలో తన్నులు తింటూనే ఉంటాడు .. అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది అభినయ్ కి … మరి ఆ చిత్రం తన జీవితం లో ఎన్ని విచిత్రాలు చేసింది అనేది తెర మీద చూడాల్సిందే ..

లిఖిత (శ్రీలీల) ఎవరు ? నీరో (చక్రవర్తి కాదులెండి) కథ లో ఏమయ్యాడు? మనం తెల్సుకోవాలంటే EOM చూడాల్సిందే

చూడదగ్గ విషయాలు :

నితిన్ నటన , రావు రమేష్ నిస్సహాయత , అక్కడక్కడ మంచి హాస్య సన్నివేశాలు , సెకండ్ హాఫ్ లో మొదటి 30 నిముషాలు

నితిన్ తన భుజాలమీద సినిమా మొత్తాన్ని నడిపించాడు . వకాంతం వంశి కథనం రెండు భాగం లో బాగుంది ,మంచి కామెడీ సీన్స్ రాసుకున్నాడు ..

ఇబ్బంది పడే విషయాలు :

ప్రథమార్ధం చాల భారంగా గడిచింది … అసలు హీరోయిన్ కి హీరో కి మధ్య ఏమాత్రం కెమిస్ట్రీ లేదు అనిపించింది .. వక్కంతం వంశి కథ కొత్తగా ఉన్నా కధనం అసలు బాలేదు , మంచి కధాంశం వ్యర్థమై పోయింది ..

షూటింగ్ లో జరిగే షెడ్యూల్లా ఏ సన్నివేశం ఎందుకొస్తుంది , ఎందుకు పోతుందో అర్ధం కాలేదు .. ఎడిటింగ్ అంత గొప్పగా లేదని చెప్పాలి .

అతుర్ , యువరాజ్, సాయి శ్రీరామ్ అని ముగ్గురు కెమెరామెన్ ఉన్నారు ఈ చిత్రానికి, వారి పనితనం అంతగా ఏమి అనిపించలేదు ..

అసలు హర్రీస్ జైరాజ్ మ్యూజిక్ ఆ యిది అనిపించింది , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది

శ్రీలీల ఇంక తన సినిమా ఎంపిక మీద దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమయింది .. ఈ సినిమా కి శ్రీలీల మైనస్ అనాల్సిందే ..

కొసమెరుపు :

రాజ శేఖర్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసారు , అది మాత్రం వెండితెర మీదే చూడాలి ..

అసలు విషయం ఏంటంటే :

అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు , మంచి కధాంశం దొరికినా, కధనంలో లోపం.

ప్రథమార్ధం , క్లైమాక్స్ , పాటలు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాలలో ఈ చిత్రం బాగోలేదు అనే చెప్పాలి

వక్కంతం వంశి దర్శకత్వం మరో సారి నిరుత్సాహ పరిచింది ..

అందుకే మా రేటింగ్ : 2.5/5

పవన్ దావులూరి