తారాగణం: సాయి ధన్షిక, విమల రామన్, గణేష్ వెంకట్రామన్, సత్య ప్రకాష్ తదితరులు
సంగీతం: కోటి
కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
నిర్మాత: డి. రాజేశ్వర్ రావు
దర్శకత్వం: ఎ. అభిరాం
విడుదల తేదీ: జూన్ 21, 2024
కథ:
దుర్గ(సాయి దన్షిక) హౌస్ వైఫ్. తన భర్తతో అనందంగా ఉంటుంది. దుర్గ కి వాళ్ళ అమ్మ, ఇద్దరు చెల్లెళ్ళు అంటే ప్రాణం. వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. దుర్గ తన కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండగా.. ఒక రోజు దుర్గ వాళ్ళ అమ్మ, చెల్లెళ్ళు మిస్ అవుతారు. దీంతో దుర్గ పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. అసలు ఆ ముగ్గురు ఎలా మిస్ అయ్యారు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? చేస్తే, ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చింది అనేదే ఈ అంతిమ తీర్పు.
విశ్లేషణ:
ఒకే కుటుంబంలో ముగ్గురు కనిపించకుండా పోవడంతో.. తన కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఓ మహిళ పోరాటానికి దిగగా.. ఆ కేసు సంచలనంగా మారి కోర్టుని చేరడం.. అనే ఆసక్తికర పాయింట్ ని దర్శకుడు ఎంచుకున్నాడు. అసలు ఆ ముగ్గురు ఏమయ్యారు? దీని వెనుక ఎవరున్నారు? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ కథలోని తీసుకెళ్లిన విధానం బాగుంది. పోలీసు పాత్రలో సత్య ప్రకాష్ ఎంటరయ్యాక.. కథ చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్ సీన్ లు, కోర్టు సీన్ లు ఆకట్టుకున్నాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఎమోషనల్ జర్నీ అయినప్పటికీ.. కమర్షియల్ అంశాలు జోడించి బోర్ కొట్టకుండా సినిమాని మలిచారు.
టెక్నికల్ గా సినిమా బాగానే ఉంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఆకట్టుకున్నాయి. లొకేషన్స్ అండ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
సాయి ధన్షినకి పర్ఫామన్స్ కి స్కోప్ ఉన్న కేరక్టర్ పడింది. దుర్గ పాత్రలో తన అందం, అభినయంతో మెప్పించింది. చాలా రోజుల తర్వాత సత్య ప్రకాష్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించారు. కీలక పాత్రలో విమల రామన్ మెరిసింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సాయి దాన్షిక, విమల రామన్, సత్య ప్రకాష్ పోటీపడి నటించారు. మిగతా నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మిస్ అయితే.. వారి ఆచూకీ కోసం ఓ మహిళ సాగించిన పోరాటంగా రూపొందిన ‘అంతీమ తీర్పు’ ఆకట్టుకుంది.
రేటింగ్: 3/5