Revanth Reddy: అల్లు అర్జున్ పేరు మర్చిపోతే నేనెందుకు ఫీలవుతా… రేవంత్ రెడ్డి కామెంట్స్ వైరల్!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారని అందుకే ఆయనని అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి కానీ ఎప్పుడూ కూడా బాధితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ పట్ల ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు అంటూ వార్తలు వినపడుతున్నాయి.

ముఖ్యంగా పుష్ప 2 సినిమా సక్సెస్ వేడుకలో భాగంగా అల్లు అర్జున్ వేదికపై మాట్లాడుతూ తన సినిమాకి సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చిన అనంతరం రేవంత్ రెడ్డి పేరును గుర్తు చేసుకొని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఫీలయ్యారని అందుకే తనపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారంటూ వార్తలు వచ్చాయి..

ఇలా పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ అరెస్టు చేయించారంటూ బిఆర్ఎస్ నేతలు కూడా పదేపదే మాట్లాడుతూ వచ్చారు. అయితే తాజాగా ఈ విషయంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఎవరో నా పేరు మర్చిపోతే నేనెందుకు ఫీలవుతాను. అలాంటి వార్తలను ఎవరు నమ్మొద్దు. నా స్థాయి అది కాదు నా గురించి ఇలాంటి ప్రచారణ జరుగుతున్నప్పుడు ఆ ప్రచారణ ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఉంది కదా అని తెలిపారు. నేనెప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.