(దుర్గం గోపాల్)
రేవంత్ రెడ్డి అనే రెడ్డాయనని తిట్టడానికి బాల్క సుమన్ అనే దళితున్ని ఎగేసుడుందెకు.. ఆయన్ని ఏమన్నంటే అట్రాసిటీ కేసు పెట్టొచ్చనేగా..!
ఇలాంటి చిల్లర ట్రిక్స్ ప్లే చేయడం వలననే కదా నిజంగా వివక్షతకు గురయ్యే దళితుల, ఆదివాసీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన SC-ST అట్రాసిటీ చట్టం నిర్వీర్యం చేయాలని చూసేది..!!
ఇలాంటి వారిని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే..
రాజకీయాలలో ఉన్న వారు ఏ కులం వారిని ఆ కులం వారే విమర్శించాలి. ప్రతీ దానికీ అనవసరంగా దళిత రాజకీయ నాయకులు ఎగేసుకుని వచ్చి మీ స్వార్థం కోసం నిజంగా పీడనకు గురయ్యే జీవుల ఆత్మగౌరవాన్ని అంగట్లో అమ్మేయవద్దు..
అవతల పార్టీ లో తమని విమర్శించిన వాడు OC అయితే చాలు వెంటనే ఇవతల పార్టీ SC ఎగేసుకుని ఎందుకొస్తున్నాడు.? అంటే అవతల ఆయన రేంజ్ చాలా చీప్ అని తెలియచేయడానికి ఇవతల పార్టీలో దళితుడితో కౌంటర్ విమర్శ చేయించి ఆయన ఈ దళితుడికి సమానమని దళిత జాతిని హీనమని తెలియచేయడం కాదా..! ఇదే కదా సమాజంలో దళితులని స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా వివక్షతలకు గురిచేస్తుంది!
అలానే అవతల పార్టీలో తమని విమర్శించిన వాడు దళితుడు అయితే వెంటనే ఇవతల పార్టీలో దళితుడే విమర్శించేందుకు ఒక చెయ్యితో నిక్కరు పైకి లాక్కుంటూ ఇంకో చెయ్యితో ముక్కు తుడుచుకుంటూ పరిగెత్తుకొస్తున్నాడు. కాని అదే దళితుడిని విమర్శించేందుకు OC వారు ఎందుకు రారు..!!ఆలోచించండి..!!
కేసిఆర్ ఏనాడైనా ఒక దళితుడిని విమర్శించడం చూసారా…!!అది భయం వల్ల కాదు..తన రేంజ్ కి దళితుడు ఏ మూలకు సరితూగడు అని.. ఆయన అనే కాదు అందరి పరిస్థితి అంతే..)
ఎందుకంటే వీరి రేంజ్ దళితుల రేంజ్ అని చూపడం వారిని మేము విమర్శించే రేంజ్ వారికి లేదని దళితులని చిన్నచూపు చూడడమే తప్ప మరొకటి కాదు..
మా పార్టీలో ఉన్న అందరినీ కాదని ఇతర పార్టీల వారిని విమర్శించడానికి నన్నే పిలుస్తున్నారు నా అంత మొనగాడు లేడని మైక్ ముందరకొచ్చి బిల్డప్ లు కొట్టుకుంటూ తెగ మూతులు తిప్పుతున్నారు. కాని వారు దళిత జాతులని హీనమన్న ప్రచారాన్ని చాలా తెలివిగా దళితులతోనే చేయిస్తున్నారన్న నగ్న సత్యం ఎవ్వరికీ అర్థమవ్వని అగ్రకుల నియంతృప భావజాలం.!
దొరల గుట్టు ఇంకెనాళ్లకు తెలుసు కుంటావు 72 సంవత్సరాలు గడిసింది గేటు కావలి ఇంకేన్నాళ్లు ఉన్న వచ్చిపోయే వాళ్లకు సెళ్లూటు కొట్టుడేనా నువ్వు రాజువయ్యేది ఏప్పుడు సమాజము నిన్ను రాజు గా చూడాలి అనుకున్నది నువ్వేమో కావలి గానే ఉంటాను అంటున్నావు దలిత జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకు దళిత జాతిని మానసిక హత్యచేయ్యకు.
దళితులకు తమని ఏమన్నా తిడితే SC ST అట్రాసిటీ పెట్టే రక్షణే లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే లేకుంటే మమ్ములను మైక్ ల కంటిన సొల్లు తుడవడానికి కుర్చీల కంటిన దుమ్ము తుడవడానికి జండాలు మోయడానికి దండాలు పెట్టడానికి ఉపయోగించుకునే వారన్న ఙ్ఞాన భోధ చేసే వారే లేరన్నది.. దళిత జాతికి ఎప్పటికీ అంతుపట్టని బెర్ముడా ట్రయాంగిల్..!!
(దుగో)✍ జై భీమ్
(* రచయిత దుర్గం గోపాల్, తెలంగాణ జన సమితి నేత, బెల్లంపల్లి. ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)
టిఆర్ఎస్ కు బాబుూమోహన్ షాక్ ఇచ్చారు. ఈ వార్త కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
https://telugurajyam.com/trs-former-mla-babumohan-expected-to-join-bjp/