Revanth Reddy: రేవంత్ పాలన మాకొద్దు… రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాసులు.. సర్వేలో షాకింగ్ విషయాలు!

Revanth Reddy: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యి సరిగా ఏడాది పూర్తి కావడంతో రేవంత్ రెడ్డి పాలన గురించి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాసులు ముక్తకంఠంతో రేవంత్ పాలన మాకొద్దు అంటూ చెప్పేస్తున్నారు.

కేసీఆర్‌ పాలనలోనే సుఖ సంతోషాలతో ఉన్నామని, రేవంత్‌రెడ్డి పాలన తమకొద్దని ముక్తకంఠంతో చెప్తున్నారు. రేవంత్‌ పాలనతో సరిపోల్చినప్పుడు కేసీఆర్‌ పాలన 100 శాతం అద్భుతమని ప్రజలు తమ మనోగతాన్ని బయటపెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో హెచ్‌ఎంటీవీ, వోటా, కేకే, చాణక్య స్టాటిస్టిక్స్‌ తదితర సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేశాయి.

ఈ సర్వేలో భాగంగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ సర్వేలో భాగంగా కొంతమంది అభిప్రాయాలను సేకరించారు అయితే వారందరూ కూడా తమకు గత పదివేల కాలంలో కేసీఆర్ పాలన చాలా మంచిగా ఉండేదని ఆ సమయంలోనే మేము ఎంతో సంతోషంగా ఉన్నామని తెలియజేశారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చేశారని గుర్తు చేశారు.

ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను హామీ ఇచ్చారు అయితే ఈ ఆరు గ్యారెంటీలను అమలు పరచడంలో దాదాపు 82% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా కెసిఆర్ పాలనకు జై కొట్టిన తెలంగాణ వాసులు రేవంత్ పాలన మాకొద్దు అంటూ ఏకకంఠంతో చెప్పేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని అనూహ్యమైన నిర్ణయాలే ఆయనకు వ్యతిరేకంగా మారాయని స్పష్టం అవుతుంది.