సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. ఏ మూలన ఏం జరిగిందో కూడా వెంటనే తెలిసిపోతుంది. ముఖ్యంగా క్రైమ్ వంటివి మాత్రం క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మధ్య టీచర్లు విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు హింసించడం వంటివి చేస్తున్నారు. అలా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ కావడంతో వెంటనే ఆ టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది.
ఇక తాజాగా మరో వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గురుకుల పాఠశాలలో ఒక టీచర్ తను ఒక గురువు అన్న సంగతి మరిచిపోయి విద్యార్థిని బాగా చితకబాదాడు. విద్యార్థి గోడ దూకి పారిపోయి మళ్లీ చెప్పకుండా వచ్చాడు అని బూతు మాటలు తిడుతూ విద్యార్థిని అందరి ముందు బాగా కొట్టాడు. దీంతో ఆ టీచర్ పై విద్యార్థుల తల్లిదండ్రులు బాగా ఆగ్రహం చేస్తున్నారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. తప్పు ఉంటే మందలించాలి కానీ అలా బాధ పెట్టడం సరికాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.