సిల్లీ : తెలంగాణాలో నాగ చైతన్య సినిమా ప్రీమియర్ షో లు అందుకే వెయ్యలేదట.!

ఈ ఏడాదిలో టాలీవుడ్ దగ్గర భారీ హిట్స్ తో పాటు భారీ ప్లాప్ లు కూడా పడ్డాయి. అయితే ఈ జూన్ నెల వరకు పర్వాలేదు కానీ జూలై నుంచి మాత్రం సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ అంతగా ఆసక్తి చూపించట్లేదు.

అయినా కూడా తమ సినిమాపై నమ్మకంతో అదృష్టం పరీక్షించుకోడానికి అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం “థాంక్ యూ” మేకర్స్ ఈరోజు తమ సినిమాతో ముందుకు వచ్చారు. ఇక ఈ చిత్రంకి హైప్ కోసం ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పించడం కోసం అనేక ప్లాన్స్ కూడా చేయగా..

ఏపీలో అయితే ముందు రోజు రాత్రే ఏ సినిమాకి కూడా ప్లాన్ చెయ్యని విధంగా ప్రీమియర్స్ షోలు అందుబాటులోకి తెచ్చారు. అయితే అయితే ఇలాంటి షోలు సాధారణంగా హైదరాబాద్ లోనే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈసారి ఏపీలోనే ఎందుకు వేశారు అక్కడ ఎందుకు వెయ్యలేదు అనేది తెలుస్తుంది.

ఈ అంశంపై మేకర్స్ చెప్పిన కారణం ఒకింత సిల్లీ గా అనిపిస్తుంది అని చెప్పాలి. తెలంగాణాలో అయితే ఈ సినిమాకి కొందరు నెగిటివ్ టాక్ ఎక్కువ స్ప్రెడ్ చేసేస్తారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పారు. మరి ఇది ఏ లెక్కన ఆలోచించారో వారికే తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ఈ కారణంతో తెలంగాణలో ప్రీమియర్స్ వెయ్యలేదట.