తెలంగాణ జంప్ జిలానీలు : గెలిచిందెవరు ? ఓడిందెవరు?

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరమైన రీతిలో వచ్చాయి. తెలంగాణ యావత్ ఓటర్లు విలక్షణమైన తీర్పును ఇచ్చారు. కేసిఆర్ కారు గుర్తుకే ఓటేసినా అందులోనూ వైవిధ్యం, వైరుద్యం చూపించారు. సాధారణ ఎమ్మెల్యేలు పెద్ద మెజార్టీతో గెలిచిన వేళ కొమ్ములు తిరిగిన నలుగురు మంత్రులు ఓటమిపాలయ్యారు. అదేబాటలో స్పీకర్ కూడా ఓటమి చెందారు.

ఇక గత ఎన్నికలు మొదలుకొని ఈ ఎన్నికల వరకు కొందరు జంప్ జిలానీలు ఉన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరిన వాళ్లు తిరిగి పోటీ చేశారు. ఇక పార్టీలో ఓడిపోయి ఇంకో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నవారు ఉన్నారు. వారిలో కొందరు ఓడిపోయారు. కొందరు గెలిచారు.  వారిలో ఎవరు ఓడారు? ఎవరు గెలిచారు? ఏ పార్టీ వారు గెలిచారు? ఏ పార్టీ వారు ఓడిపోయారు. అన్న చర్చ సాగుతున్నది. అయితే జంప్ జిలానీలు కూడా ఈసారి పెద్దమొత్తంలోనే గెలిచారు. కొందరు మాత్రమే ఓడిపోయారు. వారి వివరాలు చదవండి.

2014లో టిడిపిలో గెలిచి టిఆర్ఎస్ కు జంప్ చేసిన వారిలో ఇప్పుడు గెలిచిన వారు వీరే…

జూబ్లీహిల్స్ లో టిడిపి తరుపున గెలిచిన మాగంటి గోపీనాథ్ టిఆర్ఎస్ కు జంప్ చేశారు. 2018 లో గెలిచారు.

సనత్ నగర్ లో టిడిపి తరుపున గెలిచి టిఆర్ఎస్ లో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 2018లో గెలిచారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్

కంటోన్మెంట్ లో టిడిపి తరుపున గెలిచిన సాయన్న తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. 2018లో మళ్లీ గెలిచారు.

కుత్బుల్లాపూర్ లో టిడిపి నుంచి గెలిచిన కె.పి.వివేకానంద టిఆర్ఎస్ లో చేరారు. 2018లో మళ్లీ గెలిచారు.

కూకట్ పల్లిలో మాధవరం కృష్ణారావు గెలిచిన తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. మళ్లీ 2018 లో గెలిచారు.

ఇబ్రహింపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్లీ గెలిచారు. 

రాజేంద్రనగర్ లో ప్రకాశ్ గౌడ్ గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్లీ గెలిచారు. 

శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ టిడిపి నుంచి గెలిచి టిఆర్ఎస్ కు జంప్ చేశారు. ఇప్పుడు మళ్లీ గెలిచారు.

పరకాలలో చల్లా ధర్మారెడ్డి టిడిపి తరుపున గెలిచారు. తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు.

చల్లా ధర్మారెడ్డి, పరకాల

నారాయణపేటలో గెలిచిన రాజేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. మళ్లీ ఇప్పుడు గెలిచారు.

 పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపిలో గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు గెలిచారు.

కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి జంప్ చేసి ఇప్పుడు గెలిచిన జిలానీలు :

మిర్యాలగూడ భాస్కర్ రావు 2014లో కాంగ్రెస్ తరుపున గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు గెలిచారు.

డోర్నకల్ లో రెడ్యానాయక్ కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు గెలిచారు.

రెడ్యా నాయక్, డోర్నకల్

మక్తల్ లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచారు. టిఆర్ఎస్ లో చేరారు. 2018 లో గెలిచారు.

చేవెళ్లలో కాలే యాదయ్య కాంగ్రెస్ లో గెలిచారు. తర్వాత టిఆర్ఎస్ లో చేరి ఇప్పుడు మళ్లీ గెలిచారు.

ఖమ్మం లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు గెలిచారు.

పువ్వాడ అజయ్, ఖమ్మం

ముథోల్ లో విఠల్ రెడ్డి కాంగ్రెస్ తరుపున గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. మళ్ళీ గెలిచారు.

ఓడిపోయి వేరే పార్టీలో చేరిన వారు వీరు :

కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ టిడిపి తరుపున 2014లో ఓడిపోయి ఎన్నికల ముందు టిఆర్ఎస్ లో చేరి ఇప్పుడు గెలిచారు.

బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ

ఖైరతాబాద్ లో 2014లో కాంగ్రెస్ తరుపున ఓడిపోయిన దానం నాగేందర్ టిఆర్ఎస్ లో చేరి 2018లో గెలిచారు.

దానం నాగేందర్, ఖైరతాబాద్

టిఆర్ఎస్ లో సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ లో చేరిన పైలెట్ రోహిత్ రెడ్డి ఇప్పడు కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు. మంత్రి పట్నం ను ఓడగొట్టారు. 

ఓడిపోయిన జంప్ జిలానీలు వీరే

2014లో టిడిపి నుంచి మహేశ్వరంలో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన తీగల కృష్ణారెడ్డి 2018లో ఓటమి పాలయ్యారు.

పినపాకలో వైసిపి తరుపున గెలిచిన పాయం వెంకటేశ్వర్లు తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఓటమి చెందారు.

వైరాలో బానోతు మదన్ లాల్  వైసిపి నుంచి 2014లో గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఓడిపోయారు.

అశ్వారావుపేటలో వైసిపిలో గెలిచిన తాటి వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ లో చేరి ఇప్పుడు టిఆర్ఎస్ తరుపున ఓటమి చెందారు.

కొడంగల్ లో టిడిపి నుంచి 2014లో గెలిచిన రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ లో చేరి 2018లో ఓటమిపాలయ్యారు.

రేవంత్ రెడ్డి

పరకాలలో 2014లో టిఆర్ఎస్ లో చేరి గెలిచిన కొండా సురేఖ, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి పోటీ చేసి ఓడిపోయారు.

కొండా సురేఖ, పరకాల

చొప్పదండిలో 2014లో టిఆర్ఎస్ లో గెలిచి ఎన్నికల సమయంలో బిజెపిలో చేరిన బొడిగె శోభ ఓటమిపాలయ్యారు.

ఖానాపూర్ టిఆర్ఎస్ లో రమేష్ రాథోడ్ కు టికెట్ రాకపోవడంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి కూటమి తరుపున ఓటమి.

ఇల్లెందులో  కోరం కనకయ్య 2014లో కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఇప్పుడు ఓటమిపాలయ్యారు.