యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రెవెన్యూ అధికారి.. దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు?

ప్రస్తుత కాలంలో మహిళలకు ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుంది. స్కూల్ కాలేజ్ ఆఫీస్ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా కొంతమంది మగాళ్లు మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే కొంతమంది అధికారులు మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు . ఇటీవల కూడా ముషీరాబాద్ రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికెట్ కోసం వచ్చిన ఒక యువతి పట్ల అధికారి అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే.. ఇటీవల ఒక యువతి సర్టిఫికెట్ కోసం ముషీరాబాద్ రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళింది. అక్కడ పనిచేసే విజయ్ కుమార్ అనే అధికారి సర్టిఫికెట్ కావాలంటే ఒంటరిగా తనని కలవాలని యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి తిరిగి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో జరిగిన విషయం వెల్లడించింది.

కొంత సమయం తర్వాత మళ్లీ రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన యువతిని తల్లిదండ్రుల ఎదురుగానే అధికారి అసభ్యకరంగా ప్రవర్తించటంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఎమ్మార్వో ఎదురుగాని అధికారి మీద దాడి చేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.