రేవంత్‌కు నాకు లింక్ అన్న ఛానెళ్లను చెప్పుతో కొడతా: తారా చౌదరి

తనపై వచ్చిన అనేక రూమర్స్ పై ఒక ఇంటర్వ్యూలో స్పందించింది నటి తారా చౌదరి. గతంలో పలువురి రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలు దుమారం రేపాయి. అదే సమయంలో ఆమెకు, రేవంత్ రెడ్డితో కూడా సంబంధం ఉన్నట్టు వార్త హల్ చల్ చేసింది.

ఈ విషయం గురించి ఆమె స్పందించింది. రేవంత్ రెడ్డితో ఆమెకు సంబంధం ఉన్నట్టు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించింది. ఆ వార్తను ప్రసారం చేసిన టీవీ ఛానెళ్లపై మండిపడింది. కొన్ని టీవీ ఛానెల్స్ నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ప్రజల జీవితాలు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఛానెళ్లను చెప్పుతో కొట్టాలి అంటూ మండి పడింది.