TG: ముఖ్యమంత్రుల పేర్లు తెలియని స్థితిలో యాంకర్లు ఉన్నారా: కాంగ్రెస్ ఎంపీ

TG: ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కూడా ఏడాది కాలం పూర్తి అయింది. అయినప్పటికీ ఈయన పేరు గుర్తుంచుకోవడం అనేది నిజంగా రేవంత్ రెడ్డికి అవమానంగానే చెప్పాలి. ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది సెలబ్రిటీలు తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ ఆయన పేరును మర్చిపోవడం రేవంత్ రెడ్డికి బదులుగా ఇతరుల పేర్లను పలకడం జరుగుతుంది.

పుష్ప 2 సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు తెలంగాణలో అన్ని సదుపాయాలను కల్పించిన ముఖ్యమంత్రి అంటూ రేవంత్ పేరు చెప్పడానికి అల్లు అర్జున్ పూర్తిగా తడబడ్డారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనని అరెస్టు చేయించారు అంటూ బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ సోషల్ మీడియాలో సరికొత్త ఆరోపణలను చేశారు. ఇక ఈ ఘటన మరువకముందే ఇటీవల మరొక యాంకర్ నటుడు బాలాదిత్య సైతం తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అంటూ మాట్లాడారు దీంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఈ విధంగా నటుడు యాంకర్ బాలాదిత్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుకు బదులుగా ఇతరుల పేరు పలకడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇదే విషయం గురించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు యాంకర్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరో కూడా తెలియని పరిస్థితులలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు గుర్తుపెట్టక పోవటం వల్లే ఈయన మీడియా సమావేశంలో సెలబ్రిటీల తీరుపై మండిపడ్డారు. ఇక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడానికి కారణం గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ నాయకుల చీకటి జీవోలే కారణమని విమర్శించారు. తప్పనిసరిగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కాస్త ఆలస్యంగా అయినా నెరవేరుస్తుందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.