TG: హైదరాబాదులో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం… ముఖ్యమంత్రికి స్పెషల్ థాంక్స్ !

TG: హైదరాబాదులో సీనియర్ దివంగత నటుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్టకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా హైదరాబాదులో ఏకంగా 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రేవంత్ సర్కార్ అనుమతి తెలిపింది. ఇక ఈ విగ్రహ ఏర్పాటుకు నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటుకు స్థలం కేటాయించడానికి సీఎం అంగీకారం తెలియజేయడంతో సీఎం రేవంత్ రెడ్డికి అభిమానులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ ఈ విషయంపై స్పందిస్తూ ఎన్టీఆర్ విగ్రహం కోసం రేవంత్ రెడ్డి స్థలం కేటాయించడం ఎంతో సంతోషకరమైన విషయం అని తెలియజేశారు. ఎన్టీఆర్ కుమారుడు మోహన కృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ సభ్యులు మధుసూదన రాజు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డిని గురువారం కలిసి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ గురించి మాట్లాడారు.

ఈ విధంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కోసం స్థలం కేటాయించాలని కోరారు. ఈ క్రమంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అదొక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక్కడ ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తామని అందుకుగాను స్థలం కేటాయించాలని కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం స్థలం కేటాయించారు.

ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి స్థలం కేటాయించడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్న విషయం తెలిసిందే అయితే ఏకంగా 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయబోతుండడం గమనార్హం.